టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు. అంతేకాకుండా ఈ దఫా జరిగిన పొరపాటు మరోమారు పునరావృతం కాకుండా చూసుకుంటామని కూడా లోకేశ్ తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారిన ఓ పోస్టుపై వేగంగా స్పందించిన లోకేశ్…ప్రభుత్వం తరఫున బేషరతుగా క్షమాపణలు చెప్పడారు. ఈ విషయంలో ఎలాంటి భేషజాలకు తావు లేదన్న రీతిలో ఆయన స్పందించిన తీరు ఆసక్తి రేకెత్తిస్తోంది.
అధికారంలో ఉన్న నేతలు ప్రజలకు క్షమాపణలు చెప్పేందుకు ససేమిరా అంటూ ఉంటారు. ఏదైనా పొరపాటు జరిగినా… అది తమ వల్ల జరిగినది కాదని, తమ వైరి వర్గాల కారణంగానే అది జరిగిందంటూ బుకాయించడమూ చూస్తున్నదే. అయితే ఆ తరహా వైఖరికి లోకేశ్ ఎప్పుడో స్వస్తి చెప్పేశారు. ఏది జరిగినా… ఏమాత్రం మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ఒప్పేసుకుంటున్న లోకేశ్… తనలోని సిసలైన నేతను జనానికి పరిచయం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే… ఇటీవల తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సారీ చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అంతేకాకుండా టీటీడీ బోర్డు తరఫున చైర్మన్ బీఆర్ నాయుడుతోనూ ఆయన సారీ చెప్పించేలా చేశారు. తాజాగా ఏ ఒక్కరూ అడక్కుండానే… పవన్ కు మించిన రీతిలో లోకేశ్ సారీ చెప్పడం నిజంగానే ఆదర్శంగా నిలుస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అయినా లోకేశ్ సారీ చెప్పడానికి దారి తీసిన విషయం ఏమిటన్న విషయానికి వస్తే… బెజవాడలోని దుర్గ గుడి ప్రాంగణంలో కనీస సౌకర్యాలు లేవంటూ శుక్రవారం పలువురు భక్తులు సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేసి ఆవేదన వ్యక్తం చేశారు. గుడి పరిసరాలూ అపరిశుభ్రంగా ఉన్నాయని వారు తెలిపారు. ఈ వీడియో వైరల్ కాగా… లోకేశ్ వాటిపై స్పందిస్తూ మరోమారు ఇలాంటివి జరగకుండా చర్యలు చేపడతామంటూ బదులిచ్చారు.
This post was last modified on January 18, 2025 12:35 pm
తెలుగులో సంక్రాంతి పండక్కి సినిమాల సందడి ఎలా ఉంటుందో చెప్పేదేముంది? టాలీవుడ్కు సంబంధించి ఇదే బిగ్గెస్ట్ షార్ట్ సీజన్. ఈ…
ఇటీవలే విడుదలైన డాకు మహారాజ్ వారం తిరక్కుండానే వంద కోట్ల గ్రాస్ దాటేసి సూపర్ హిట్ దిశగా పరుగులు పెడుతోంది.…
న్యూ ఇయర్ సందర్బంగా టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి... బీజేపీ మహిళా నేత, సినీ…
ఏదైనా పెద్ద సినిమాకు సంగీత దర్శకుడిని ఎంచుకునే పని స్టార్ హీరోల దర్శకులకు పెద్ద సవాల్ గా మారుతున్న తరుణంలో…
టీడీపీ… దేశ రాజకీయాల్లో ఓ ప్రభంజనం. ఆవిర్భవించిన 9 నెలల కాలంలోనే అధికారం చేజిక్కించుకున్న పార్టీగా టీడీపీపై ఉన్న రికార్డు…
వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలు నిత్యం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై సెటైర్ల మీద సెటైర్లు వేసే వారు.…