వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలు నిత్యం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై సెటైర్ల మీద సెటైర్లు వేసే వారు. మీడియా మైకు కనిపించిందంటే చాలు… చోటామోటా వైసీపీ నేతలు కూడా బాబుపై పరాచకాలాడేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి రివర్స్ అయిపోయింది. టీడీపీతో పాటు కూటమిలోని మిగిలిన రెండు పార్టీలకు చెందిన నేతలు కూడా జగన్ ను ఏ రేంజిలో విమర్శిస్తున్నారు. జగన్ చేపట్టిన ప్రతి పనినీ.. చంద్రబాబు నిర్ణయాలతో పోలుస్తూ వారు సెటైర్లు సంధిస్తున్నారు.
అలాంటి సెటైర్లకు ప్రస్తుత సీఎం చంద్రబాబు అదిరిపోయే మెటీరియల్ ఇచ్చేశారు. శుక్రవారం నాటి ఏపీ కేబినెట్ బేటీలో కూటమి సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పేదల ఇళ్ల కోసం ప్రభుత్వం ఇచ్చే స్థలాల విస్తీర్ణాన్ని కూటమి సర్కారు దాదాపుగా ట్రిపుల్ చేసింది. అంటే… జగన్ జమానాలో ప్రభుత్వం ఇచ్చిన భూమి కంటే మూడింతల విస్తీర్ణం మేర స్థలం పేదల ఇంటి నిర్మాణం కోసం ఇస్తారన్న మాట.
జగన్ హయాంలో అటు గ్రామీణ ప్రాంతాల్లో అయినా, ఇటు పట్టణ ప్రాంతాల్లో అయినా… సెంటు, లేదంటే సెంటున్నర విస్తీర్ణంతో స్థలాలను ఇచ్చారు. ఈ విస్తీర్ణాన్ని గ్రామాల్లో 3 సెంట్లకు, పట్టణాల్లో 2 సెంట్లకు పెంచుతున్నట్లు కూటమి సర్కారు ప్రకటించింది. ఈ మేరకు ఏపీ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి కేటినెట్ భేటీ వివరాలను వెల్లడించిన సందర్బంగా తెలిపారు.
నాడు జగన్ ఇచ్చే సెంటు స్థలంలో సమాధి కట్టుకోవడం కూడా వీలు కాదంటూ టీడీపీ నేతలు సెటైర్లు సంధించింది. వాస్తవంగా సింగిల్ సెంటులో ఇల్లు కట్టుకోవడం అంటే ఒకింత కష్టమే. అయినా కూడా పట్టణాల్లోని అపార్ట్ మెంట్ కల్చర్ ను చూపి తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. ఇప్పుడు వైసీపీకి ఆ అవకాశం కూడా లేకుండా చేస్తూ… కూటమి సర్కారు పేదల ఇంటి స్థలాలను ట్రిపుల్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
This post was last modified on January 18, 2025 10:27 am
మనకు జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. కానీ కొన్ని చిన్న అలవాట్లను మనం నిర్లక్ష్యం చేస్తుంటాము.…
నందమూరి బాలకృష్ణ తన ప్రతి పుట్టిన రోజుకూ అభిమానులకు సినిమాల పరంగా కానుక ఇస్తుంటాడు. అప్పటికి నటిస్తున్న సినిమా నుంచి…
ఒకప్పుడు కన్నడ సినిమా అంటే రొటీన్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆ మాస్ సినిమాలు కూడా ఎక్కువగా తెలుగు, తమిళం…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…