Political News

విశాఖ ఉక్కుకు నవ జీవం… బాబు మాటకు కేంద్రం దన్ను

ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుకు నిజంగానే కొత్త జీవం వచ్చేసింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న విశాఖ ఉక్కుకు జీవం పోసేలా… కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం తరఫున రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం సాయత్రం కీలక ప్రకటన చేశారు. విశాఖ ఉక్కుకు పునరుద్ధరణ ప్యాకేజీ కింద రూ.11.440 రోటకలను కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ప్యాకేజీతో విశాఖ ఉక్కును వెంటాడుతున్న సమస్యలకు చెక్ పడిపోవడం ఖాయమేనని మంత్రి తెలిపారు.

విశాఖ ఉక్కు ఏపీకే కాకుండా… యావత్తు దేశానికి కీలక ప్రాజెక్టు అని వైష్ణవ్ తెలిపారు. ఈ కర్మాగారం ద్వారా దేశానికి విలువైన ఉక్కు అందుతోందని కూడా ఆయన అన్నారు. అలాంటి ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ఎందుకు వదులుకుంటుందని కూడా మంత్రి ప్రశ్నించారు. రివైవల్ ప్యాకేజీ కింద విశాఖ ఉక్కులో 3 బ్లాస్ట్ ఫర్నేస్ లను ఏర్పాటు చేస్తామన్న మంత్రి… వాటిలో రెండింటి పనులు తక్షణమే ప్రారంభమవుతాయని తెలిపారు. మూడో ఫర్నేస్ పనులు ఆగస్టులో మొదలు అవుతాయని పేర్కొన్నారు. వెరసి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దిశగా జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం తన చర్యల ద్వారా కొట్టిపారేసింది.

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ ఉక్కు కేంద్రంగా నాటి అధికార వైసీపీ, నేటి అధికార కూటమి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. టీడీపీ నేతృత్వంలోని కూటమి అదికారంలోకి వస్తే,… విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగడం ఖాయమేనని వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. అయితే తాము అధికారంలోకి వస్తే… విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ ముప్పు నుంచి కాపాడతామని టీడీపీ అదినేత నారా చంద్రబాబునాయుడు తెలిపారు. విశాఖ ఉక్కును ప్రమాదంలో పడవేసింది జగనేనని కూడా ఆయన ఆరోపించారు.

తాజాగా కేంద్రం ప్రకటించిన రివైవల్ ప్యాకేజీతో జగన్ చేసినదంతా దుష్ప్రచారమేనని తేలిపోయింది. జగన్ చెప్పినట్లుగా కూటమి అదికారంలోకి వచ్చిన నేపథ్యంలోనే విశాఖ ఉక్కుకు పునరుజ్జీవం లభించింది. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు కృషి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ ఆయన ప్రధాని నరేంద్ర మోదీ వద్ద, ఇతర కేంద్ర మంత్రుల వద్ద విశాఖ ఉక్కు గురించి ప్రస్తావిస్తూ.. దాని పునరుద్ధరణఎంత అవసరమో వివరిస్తూ వచ్చారు. దీంతోనే విశాఖ ఉక్కుకు కేంద్రం నుంచి రివైవల్ ప్యాకేజీ లభించింది. ఈ ప్యాకేజీతో చంద్రబాబుతో పాటు కూటమి సర్కారుకు ఓ రేంజి మైలేజీ దక్కినట్టేనని చెప్పాలి.

ఇదిలా ఉంటే… విశాఖ ఉక్కుకు రివైవల్ ప్యాకేజీ అంటూ గురువారమే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. గురువారం నాటి కేంద్ర కేబినెట్ లో ఇందుకు సంబంధించి కీలక నిర్ణయం జరిగిపోయిందని ప్రచారం జరిగింది.అయితే ఆ ప్యాకేజీ ఏమిటన్న దానిపై శుక్రవారం కేంద్రమే కీలక ప్రకటన చేస్తుందని వార్తలు వచ్చాయి. ఇక ఈ ప్యాకేజీపై ఏపీకి చెందిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోన్ నాయుడు చేసిన ట్వీట్ ఆసక్తి రేకెత్తించింది. విశాఖఉక్కుకు కేంద్రం రూ.10,300 కోట్ల ప్యాకేజీని ప్రకటించిందని ఆయన పేర్కొనడం గమనార్హం. అయితే అంతకుమించి రూ.11,440 కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించడం ఏపీ వాసులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది.

This post was last modified on January 18, 2025 10:22 am

Share

Recent Posts

గీత గోవిందం దర్శకుడికి బ్రేక్ దొరికింది

అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ సంపాదించుకున్న యూత్ ఫాలోయింగ్ కి అదనంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని జోడించిన బ్లాక్ బస్టర్…

2 hours ago

మంత్రి ఎదుట జెండాలు పట్టుకుని రోబోల నిరసన..!

"హలో... ఐ యామ్ చిట్టి. స్పీడ్ వన్ టెరా హెర్ట్జ్, మెమరీ వన్ జెట్టా బైట్!" రజనీకాంత్ రోబో సినిమాలో…

3 hours ago

సూర్యని ఊరిస్తున్న ట్రిపుల్ మైలురాయి

మొన్నటిదాకా వరస డిజాస్టర్లతో మార్కెట్ రిస్క్ లో పడేసుకున్న సూర్య మాములు కంబ్యాక్ ఇవ్వలేదు. అసలు పెద్దగా అంచనాలు లేకుండా…

3 hours ago

ర‌వితేజ కొడుకు… యాక్టింగ్ కోస‌మే డైరెక్ష‌న్

టాలీవుడ్ స్టార్ హీరోల కొడుకులకు చిన్నతనంలోనే సినిమా పురుగు కుట్టేస్తుంది. బాల నటుడిగానే అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. ఆ కోవలోనే…

4 hours ago

ప్ర‌పంచ‌పు వింత అంటే ఇదే: యువ‌కుడికి గ‌ర్భాశ‌యం!

మ‌హిళ‌లు మీసాలు పెంచ‌లేర‌ని.. పురుషులు గ‌ర్భాన్ని దాల్చ‌లేర‌ని సామెత‌!. అయితే.. ఇటీవ‌ల కాలంలో ర‌ష్యాకు చెందిన ఓ మ‌హిళ మీసాలు…

6 hours ago

జగన్ నమ్మకం ఏంటో అర్థం కావట్లేదే!

విశ్వాసం..అతి విశ్వాసం…ఈ రెండింటికి మధ్య ఒక సన్నని గీత ఉంది. ఈ విషయం తెలుసుకోకుండా చాలామంది రాజకీయ నేతలు తొందరపడుతుంటారు…

6 hours ago