Political News

వైసీపీ క‌న్నా ముందే ప్ర‌జ‌ల్లోకి టీడీపీ.. స‌రికొత్త స్ట్రాట‌జీ.. !

వైసీపీ క‌న్నా ముందుగానే ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చేందుకు.. ప్ర‌భుత్వం చేస్తున్న కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించేందుకు కూట‌మి పార్టీల్లో కీల‌క‌మైన టీడీపీ ప్ర‌య‌త్నిస్తోంది. దీనికి సంబంధించి ప్ర‌త్యేకంగా కార్య‌క్ర‌మాలు కూడా రెడీ చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. దీనిపై చంద్ర‌బాబు కూడా ప‌క్కా వ్యూహంతో ఉన్నారు. వ‌చ్చే ఫిబ్ర‌వ‌రి నుంచే స్వ‌ర్ణాంధ్ర‌ పేరుతో పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చేలా ఒక కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుడుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఆరు మాసాల్లో చేసిన కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌నున్నారు.

కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత‌.. తీసుకువ‌చ్చిన పెట్టుబడులు.. త‌ద్వారా రాష్ట్రానికి క‌లిగే ప్ర‌యోజ నం.. వ‌చ్చే ఉపాధి, ఉద్యోగాలు వంటివాటిని వివ‌రించే ప్ర‌య‌త్నం చేయ‌నున్నారు. దీనివ‌ల్ల త‌మ ప్ర‌భు త్వం ఏం చేసింద‌నే విష‌యంపై ప్ర‌స్తుతం సందేహం గా ఉన్న కొన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు క్లారిటీ ఇవ్వ‌నుంది. నిజానికి కూట‌మి పార్టీల‌న్నీ క‌లిసి ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని చంద్ర‌బాబు తొలుత భావించారు. కానీ, దీనికి ఇత‌ర పార్టీలు పెద్ద‌గా ప్ర‌య‌త్నం చేయ‌డం లేదు.

దీంతో త‌మ‌ను తాము డిఫెన్స్ చేసుకునేందుకు ఉన్న అవ‌కాశంపై చంద్ర‌బాబు దృష్టి పెట్టారు. రెండేళ్లు ఆగి ప్ర‌జ‌ల్లోకి వెళ్తే.. అప్ప‌టికి.. వైసీపీ వ్య‌తిరేక‌త‌ను పెంచే అవ‌కాశం ఉంటుంద‌ని అంచనా వేసుకున్నా రు. ఇదే జ‌రిగితే.. అప్ప‌టి వ‌ర‌కు చేసిన మంచిక‌న్నా కూడా.. చెడు ఎక్కువ‌గా ప్ర‌చారం అవుతుంద‌ని లెక్క లు వేసుకున్న చంద్ర‌బాబు ఫిబ్ర‌వ‌రి నుంచే ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌న ఇటీవ‌ల వెల్ల‌డించారు. తాజాగా దీనిపై నారా లోకేష్ ప్ర‌క‌ట‌న చేశారు.

స్వ‌ర్ణాంధ్ర పేరుతో ఫిబ్ర‌వ‌రి నుంచి పార్టీ త‌ర‌ఫున కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్న‌ట్టు చెప్పుకొచ్చారు. త‌ద్వారా.. పార్టీని బ‌లోపేతం చేయ‌డం పై ఆయ‌న దృష్టి పెట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు విరివిగా పాల్గొనాల‌ని కూడా చెప్పుకొచ్చారు. ప‌ద‌వుల విష‌యాన్ని ప్ర‌స్తావించిన నారా లోకేష్‌.. స్వ‌ర్ణాంధ్ర‌లో విజ‌యం ద‌క్కించుకున్న వారికి అంటే.. దీనిని బాగా ప్ర‌మోట్ చేసిన వారికి ప‌ద‌వులు వెతుక్కుంటూ వ‌స్తాయ‌ని చెప్పుకొచ్చారు. సో.. ఫిబ్ర‌వ‌రి నుంచి వైసీపీ చేప‌ట్టే కార్య‌క్ర‌మాల‌కు కౌంట‌ర్ గా టీడీపీ దీనిని చేప‌ట్ట‌నుంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

This post was last modified on January 17, 2025 10:26 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ముహూర్తం కుదిరింది.. ఆ గ్యారెంటీలూ అమ‌లు!

తెలంగాణ‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన గ్యారెంటీల‌లొ ఇప్ప‌టి వ‌ర‌కు కొన్ని మాత్ర‌మే అమ‌లు చేసింది.…

33 minutes ago

గుర్తించమని బాధపడుతున్న హిట్టు దర్శకుడు

ఒక్కోసారి ఎంత హిట్టు కొట్టినా ఆశించినంత పేరు రాకపోవడం నటీనటుల విషయంలో జరుగుతుందేమో కానీ దర్శకులకు అరుదు. కానీ సుందర్…

46 minutes ago

బీటెక్ వర్సెస్ రెడ్డమ్మ… కడపలో కొత్త కొట్లాట

కడపలో ఎం జరిగినా సంచలనమే అవుతోంది. ఈ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా…

56 minutes ago

మార్కోను చూసిన వాళ్లు.. పుష్ప-2ను చూడలేదే

పుష్ప-2 సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. హిందీలో అన్ని బాక్సాఫీస్ రికార్డులనూ ఈ…

1 hour ago

పని లేనప్పుడు ‘పని’కొచ్చే థ్రిల్లర్

మలయాళం సినిమాలు ఈ మధ్య కాలంలో కంటెంట్ ఆధారంగా వచ్చి భాషతో సంబంధం లేకుండా కొన్ని వర్గాల ప్రేక్షకులను బాగానే…

2 hours ago

బాలయ్య & రజిని ఒకేసారి తెరపై కనిపిస్తే…

ఎప్పటినుంచో అభిమానులు కోరుకుంటున్న కాంబినేషన్ నిజంగా జరిగితే దానికొచ్చే కిక్కు మాములుగా ఉండదు. అందుకే మల్టీస్టారర్లు మనకు అరుదైపోయాయి. రజనీకాంత్…

2 hours ago