బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు సంక్రాంతి వేళ భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఫార్ములా ఈ కార్ రేసుల వ్యవహారంలో తనపై నమోదు అయిన ఏసీబీ కేసును రద్దు చేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం సుప్రీమ్ కోర్ట్ తోసిపుచ్చింది. దీంతో ఈ కేసును ఎదుర్కోవడం మినహా కేటీఆర్ కు గత్యంతరం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఫార్ములా రేసుల కేసును రద్దు చేయాలంటూ ఇప్పటికే కేటీఆర్ తెలంగాణ హైకోర్ట్ ను ఆశ్రయించగా… కోర్ట్ ఆ పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో కేటీఆర్ సుప్రీమ్ కోర్ట్ ను ఆశ్రయించారు. ఈ పిటిషన్ నీ బుధవారం సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం త్రివేది విచారించారు. కేసు ప్రాథమిక దశలో ఉన్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై జోక్యం చేసుకోలేమని కోర్ట్ అభోప్రాయపడింది.
అంతేకాకుండా… ఎన్నో ప్రత్యామ్నాయ మార్గాలు ఉండగా క్వాష్ పిటిషన్ ఎందుకు వేశారని కూడా ప్రశ్నించారు. దీంతో పిటిషన్ ను ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని కేటీఆర్ న్యాయవాది కోరగా… అందుకు కోర్ట్ అనుమతించింది.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచాలన్న భావనతో ఫార్ములా రేసులను నిర్వహించామని కేటీఆర్ చెబుతుంటే… నిబంధనలకు విరుద్దంగా నిధులను విదేశాలకు ఎలా పంపుతారంటూ ఏసీబీ వాదిస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on January 15, 2025 1:20 pm
ఎప్పుడో 2012లో మొదలైన తమిళ సినిమా.. మద గజ రాజా. కొన్ని కారణాల వల్ల మేకింగ్‌లో ఆలస్యం జరిగి.. 2013…
ఏపీ రాజధాని అమరావతి రైతులకు సీఎం చంద్రబాబు పండగ పూట భారీ కానుక అందించారు. గత ఏడాదిన్నరగా నిలిచి పోయిన…
క్వీన్, మణికర్ణిక లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌తో ఒక టైంలో బాలీవుడ్లో తిరుగులేని స్థాయిని అందుకుంది కంగనా. అప్పట్లో ఆమెకు…
సంక్రాంతి పండుగ అంటేనే అందరికీ వేడుక. కలవారు.. లేనివారు అనే తేడా లేకుండా చేసుకునే పండుగ ఇది. కనీసంలో కనీసం..…
రెండున్నర గంటలు అండర్ కవర్ ఆపరేషన్ చేసి సినిమా చివర్లో ట్విస్ట్ ఇచ్చే హీరోలాగా పండగ బరిలో లాస్ట్ వచ్చిన…
దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం ఎన్నికల హీట్ ఉడికిస్తోంది. అదే సమయంలో అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)…