తిరుమల వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై ఏపీలో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అటు టీడీపీ, ఇటు వైసీపీకి చెందిన కీలక నేతలు పెద్దగా ఈ ఘటనపై మాట్లాడటం లేదు. అయితే మాజీ మంత్రి రోజా మాత్రం ఈ ఘటనపై నిత్యం మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. కూటమి సర్కారు తప్పిదం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని, ఇందుకు చంద్రబాబు బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదివారం తీరిగ్గా… రోజాపై ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. తాడిపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన జేసీ… రోజా తీరును ఓ రేంజిలో ఎండగట్టారు. తిరుమల ప్రత్యేక దర్శన టికెట్లను అమ్ముకుని… ఆ డబ్బుతోనే రోజా బెంజి కారు కొన్నారని ఆయన ఆరోపించారు. తిరుమల దర్శనానికి వెళ్లినప్పుడల్లా వందల మందిని వెంటబెట్టుకుని వెళ్లిన రోజా… అలా తన వెంట తీసుకెళ్లిన వారి వద్ద నుంచి భారీ ఎత్తున డబ్బు వసూలు చేశారని ఆరోపించారు. ఆ డబ్బుతోనే రోజా బెంజి కారు కొన్నారన్నారు.
ఇక రోజాపై చెక్ బౌన్స్ కేసులు కూడా ఉన్నాయని జేసీ గుర్తు చేశారు. ఈ కేసులు కూడా ఎక్కడో కాదని, అనంతపురంలోనే ఈ కేసుల విచారణ జరుగుతోందని ఆయన అన్నారు. తిరుమతి తొక్కిసలాటకు చంద్రబాబు కారణమని ఆరోపించిన రోజా… వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సేచించారు. రోజా తన నోరును అదుపులో పెట్టుకోవాలని కూడా జేసీ ఒకింత గట్టిగానే హెచ్చరించారు.
ఇదిలా ఉంటే… చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతి సారి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తిరుపతి తొక్కిసలాట జరగ్గానే… గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటను వైసీపీ గుర్తు చేసింది. వైసీపీ ఆరోపణలపై మండిపడ్డ జేసీ… వైసీపీ పాలనలో జరిగిన దుర్ఘటనలతో ఏకంగా ఓ ఫ్లెక్సీని రూపొందించి దానిని ప్రదర్శనకు పెట్టడం విశేషం.
This post was last modified on January 12, 2025 5:02 pm
గత కొన్ని రోజులుగా బయట ప్రచారం జరుగుతున్నట్టు ఆదర్శ కుటుంబం ఏకె 47 ఒక వారం వాయిదా పడింది. ముందు…
ఒక మీడియం బడ్జెట్ సినిమాకు రాజమౌళి ప్రెజెంట్స్ అని పడిందంటే అందులో విషయం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే…
జపాన్‌పై రెండు పరుగుల తేడాతో గెలిచారు. కానీ ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా బ్యాటింగ్‌పై మళ్ళీ సందేహాలు మొదలయ్యాయి. భారత…
ఒకప్పుడు గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించుకోవడమంటే అదో పెద్ద ఘనతగా భావించే వాళ్ళు. పెద్ద పెద్ద…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ప్రకటించే నంది అవార్డులకు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డులతో సమానంగా చూసేవారు.…
టాలీవుడ్ సినిమాలకు అదేం శాపమో అర్థం కాదు కానీ కొన్నింటికి ప్రభుత్వాల నుంచి జిఓలు సకాలంలో రావు, చివరి నిమిషం…