Political News

వాహ్: పండుగ రద్దీ నియంత్రణకు డ్రోన్లు!

సంక్రాంతి పండుగ వచ్చేసింది. అప్పుడే సెలవులు కూడా మొదలైపోయాయి. ఇంకేముంది… పట్టణాల్లోని జనం అంతా తమ సొంతూళ్లకు బయలుదేరి పోతున్నారు. ప్రత్యేకించి హైదరాబాద్ నుంచి ఏపీకి వెళుతున్న వారు లక్షల్లో ఉన్నారు. వీరంతా ఒకేసారి తమ ఊళ్లకు బయలుదేరిన నేపథ్యంలో తెలంగాణ నుంచి ఏపీకి దారి తీస్తున్న రదహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి.

అందులోనూ సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటే కోస్తాంధ్రకు అత్యధిక సంఖ్యలో జనం తరలివెళుతన్నారు. సొంతూళ్లకు వెళ్లేవారు కొందరైతే… కోస్తాంధ్రలో జరిగే సంక్రాంతి సంబరాలను వీక్షించేందుకు వెళుతున్నవారు మరికొందరు ఉన్నారు. ఫలితంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయింది.

సంక్రాంతి సంబరాలు ఆకాశాన్నంటే… రాజమహేంద్రవరం, భీమవరం సహా ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, ఇతర ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లే వారంతా విజయవాడ మీదుగానే వెళ్లాల్సి ఉంది. ఫలితంగా బెజవాడ పరిసరాల్లో అసాదారణ రద్దీ నెలకొంది. అయితేనేం… ఈ రద్దీని పోలీసులు అందుబాటులోకి వచ్చిన ఆధునిక టెక్నాలజీని వినియోగించి…ఎంచక్కా ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు.

ప్రస్తుతం విజయవాడ పోలీస్ కమిషరేట్ పరిధిలో డ్రోన్లను వినియోగిస్తున్న పోలీసులు… ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తున్నారు. ఫలితంగా హైదరాబాద్ నుంచి విజయవాడ దరిదాపుల దాకా ట్రాఫిక్ ఓ రేంజిలో కనిపిస్తున్నా… విజయవాడ పరిసరాల్లో మాత్రం అంతగా ట్రాఫిక్ చిక్కులు కనిపించడం లేదు.

అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని ఎలా వినియోగించుకోవాలన్న విషయంలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుని మించిన వారు లేరనే చెప్పాలి. మొన్నటి బెజవాడ వరదల్లో డ్రోన్ల సాయంతో బాధితులకు ఆహారం, ఇతరత్రా నిత్యావసరాలను పంపిన అనుభవంతో డ్రోన్ టెక్నాలజీపై చంద్రబాబు దృష్టి సారించారు. అసలు డ్రోన్ టెక్నాలజీని వాడుకుంటే… ఎన్నెన్ని ప్రయోజనాలు ఉంటాయన్న విషయాన్ని జనానికి వివరించేందుకు అమరావతిలో ఏకంగా డ్రోన్ సదస్సునే నిర్వహించారు.

అంతేకాకుండా కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు ఏకంగా డ్రోన్ హబ్ ను నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం 200 ఎకరాల భూమిని కూడా కేటాయించారు. ఇక ఇటీవలే తన భద్రతా వ్యవస్థలోకి డ్రోన్లకు ఎంట్రీ ఇప్పించిన చంద్రబాబు.. భద్రతా సిబ్బందిని తగ్గించుకుని ప్రజా ధనాన్ని ఆదా చేస్తున్నారు. తాజాగా ట్రాఫిక్ నియంత్రణకూ డ్రోన్ టెక్నాలజీని వాడేలా అధికారులకు ఆయన మార్గదర్శిగా నిలిచారు.

This post was last modified on January 11, 2025 7:26 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

3 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

4 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

4 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

4 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

5 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

6 hours ago