ఒక వ్యూహం కొన్ని దారులు ఏర్పాటు చేస్తుంది. ఒక ప్రణాళిక వందల అవకాశాలు కల్పిస్తుంది. ఇప్పుడు ఏపీలోనూ ఇలాంటి వాతావరణమే కనిపిస్తోంది. మంత్రి నారా లోకేష్ మనసులోని మాట కూడా ఇదే. ఎన్నికలకు ముందు ఏటా 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన ఆయన.. తాజాగా ఇదే విషయంపై అంతర్మథనం చెందుతున్నారు.
ఎట్టి పరిస్థితిలోనూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని భావిస్తున్నారు. ఇదేసమయంలో వచ్చే మూడు మాసాల్లోనే స్పష్టమైన హామీ సాకారం దిశగా అడుగులు వేయాలని నిర్ణయించారు.
ఎలా..
అయితే.. హామీ ఇచ్చినంత తేలికగా అయితే.. ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదు. దీనికి ఎంతో కృషి కావాలి. పట్టుదల ఉండాలి. ఈ క్రమంలోనే మంత్రి నారా లోకేష్ ప్రయత్నాలు సాగుతున్నాయి. వచ్చే మూడు మాసాల్లో సుమారు 50 వేల ఉద్యోగాలు కేవలం భవన నిర్మాణ రంగంలో కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం పెట్టుబడుల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ క్రమంలో ప్రతి అవకాశం ఉన్న విభాగాన్నీ రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా భవన నిర్మాణాల అనుమతులకు సంబంధించి విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. ఇప్పటి వరకు సంక్లిష్టంగా ఉన్న అనుమతులను స్వయంగా చేసుకునేలా ఆన్‌లైన్ విధానాన్ని తీసుకువస్తున్నారు. తద్వారా ఆటోమేటిక్‌గానే అరలక్ష ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు .
ఇప్పటి వరకు భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి కార్యాలయాలకు రావాల్సి ఉంది. కానీ, ఇకపై కన్సల్టెన్సీలకు లైసెన్సులు ఇవ్వనున్నారు. తద్వారా ఇంజనీరింగ్ పట్టభద్రతులకు స్వయం ఉపాధి లభించనుంది.
ఇదేసమయంలో భవన నిర్మాణ రంగంలో కార్మికులకు కూడా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. తద్వారా వారి నైపుణ్యాలు పెరగడంతోపాటు.. ఐటీఐ చదివిన వారిని కూడా ఈ దిశగా ప్రోత్సహించనున్నారు. ఫలితంగా వచ్చే మూడు మాసాల్లోనే 50 వేల మందికి ఉపాధి చూపించే దిశగా నారా లోకేష్ ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.
ఏటా కనీసంలో కనీసం 2 లక్షల మందికి ఉపాధి చూపిస్తే.. మిగిలిన వారికి ఐటీ కంపెనీల్లోనూ ఉద్యోగాలు చూపించే వెసులు బాటు వస్తుంది. తద్వారా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు మార్గం సుగమం కానుంది.
This post was last modified on January 11, 2025 6:13 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…