రాయలసీమ అంటేనే… ఫ్యాక్షన్ గొడవలకు పెట్టింది పేరు. నిత్యం వైరి వర్గాలపై దాడులు చేసుకుంటూ కాలం వెళ్లదీసే ఇక్కడి వారిలో ఇటీవలి కాలంలో పెను మార్పులే వస్తున్నాయి. ఫ్యాక్షన్ పగలను పక్కనపెట్టేసి.. అభివృద్ధి మంత్రం పటిస్తూ ఇతర ప్రాంతాల వారికి వీరు ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి ఆసక్తికర ఘటనల్లో శనివారం కూడా ఒకటి సాక్షాత్కరించింది. అది కూడా ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరైన పులివెందుల గడ్డపైన. వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంతూరు అయిన పులివెందులలో ఈ ఘటన కనిపించడం గమనార్హం.
జగన్ సొంతూళ్లో ఫ్యాక్షన్ పగలు ఇంకెందుకబ్బా అంటూ.. అందరినీ తట్టి లేపిన నేత వైసీపీకి చెందిన వారు అనుకుంటే మనం పొరబడినట్టే. ఎందుకంటే… శనివారం పులివెందులలో కనిపించిన ఈ ఆదర్శ ఘటనకు కారణం టీడీపీ యువనేత, మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్ర నాథ్ రెడ్డి. ఈ పేరు ఎక్కడా వినలేదే అంటారా?… అయితే ఆ నేత మరెవరో కాదు బీటెక్ రవిగా తెలుగు రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న టీడీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి. పేరు రవీంద్ర నాథ్ రెడ్డే అయినా… బీటెక్ విద్యనభ్యసించిన నేపథ్యంలో బీటెక్ రవిగా ఆయన మారిపోయారు.
అయినా అసలు విషయం చెప్పలేదు కదూ. శుక్రవారం రాత్రి జగన్ కు అత్యంత సమీప బంధువు, ఆయన సోదరుడు, గతంలో వైసీపీలో కీలకంగా వ్యవహరించిన ఆ పార్టీ వైద్య విభాగం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వైఎస్ అభిషేక్ రెడ్డి మరణించారు. అనారోగ్యం నేపథ్యంలో చాలా కాలంగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అభిషేక్… శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ క్రమంలో రాత్రే ఆయన పార్ఘీవ దేహాన్ని పులివెందుల తరలించారు. ఎంత రాజకీయ వైరం ఉన్నా… అభిషేక్ రెడ్డిని సొంతూరు వాడిగానే పరిగణించిన బీటెక్ రవి… నేరుగా వైఎస్ ఫ్యామిలీ వద్దకు వెళ్లి అభిషేక్ కు నివాళి అర్పించారు. అనంతరం అభిషేక్ తండ్రి, తాత, ఇతర కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు.
ఫ్యాక్షన్ కక్షలు, పగలూ, ప్రతీకారాలు పక్కనపెట్టేసి తమ ఇంటికి వచ్చిన బీటెక్ రవిని వైఎస్ ఫ్యామిలీ కూడా ఆత్మీయంగానే పలుకరించారు. పార్టీలు వేరైనా తమ బిడ్డ చనిపోతే సంతాపం తెలిపేందుకు వచ్చిన రవిని వారు ఆప్యాయంగా చూసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే… శనివారం మధ్యాహ్నం అభిషేక్ అంత్యక్రియలు జరగనున్నాయి. జగన్ సహా వైఎస్ ఫ్యామిలీ సభ్యులు అంతా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. వైద్యుడైన అభిషేక్ రెడ్డి… అతి చిన్న వయసులోనే అనారోగ్యం బారిన పడి చనిపోవడం నిజంగానే వైఎస్ ఫ్యామిలీని తీవ్రంగా కలచివేస్తోంది.
This post was last modified on January 11, 2025 10:53 am
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతగా ఓ రేంజిలో ఎలివేషన్లు దక్కించుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా నిజంగానే పండుగ పూట…
గత డిసెంబర్ లో సర్వం సిద్ధం చేసుకుని పూజా కార్యక్రమాలతో సినిమా మొదలవుతుందని అందరూ ఎదురు చూస్తున్న టైంలో మోక్షజ్ఞ…
నిన్న విడుదలైన గేమ్ ఛేంజర్ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోనప్పటికీ మిక్స్డ్ టాక్ తోనూ క్రమంగా పుంజుకుంటుందనే నమ్మకంలో…
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం డాకు మహారాజ్ ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస హిట్లతో మంచి జోరు…
విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు మరో కీలక మలుపు తీసుకుంది. గోపాలపురం ఎయిర్పోర్టు…
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందగా 40…