ఏపీలో ఇప్పుడు కామేపల్లి తులసి బాబుపై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. వైసీపీ అదికారంలో ఉండగా… సీఐడీ ఛీఫ్ గా కొనసాగిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ కు సన్నిహితుడిగా పేరున్న తులసి బాబు ఇటీవల ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చారు.
ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా కొనసాగుతున్న కనుమూరి రఘురామకృష్ణరాజును గతంలో అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు… తమ కస్టడీలో ఆయన పై థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న వ్యవహారంపై విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రఘురామపై థర్డ్ డిగ్రీలో ప్రైవేట్ వ్యక్తి అయిన తులసి బాబు కూడా పాలుపంచుకున్నారన్నది ఆయనపై ఉన్న ఆరోపణ.
ఓ రేంజిలో ఎత్తు, ఆ ఎత్తుకు తగ్గ లావుతో చూడటానికి భయం పుట్టేలా కనిపించే తులసి బాబును నాడు సీఐడీ ఆఫీస్ కు పిలిపించిన సునీల్…ఆయనను రఘురామ గుండెలపై కూర్చోబెట్టారట. ఈ విషయాన్ని రఘురామ బయటపెట్టగా… తులసిబాబును విచారణకు పిలిచిన సీఐడీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం తులసి బాబును తరలించారు. ఈ విషయం తెలుసుకున్న గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పరుగు పరుగున అక్కడికి చేరుకున్నారు. తులసి బాబు యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారిపోయాయి.
ప్రవాసాంధ్రుడైన వెనిగండ్ల రాము చాలా కాలంగా టీడీపీ నేతగా కొనసాగుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన వైసీపీ అభ్యర్థిగా నిలిచిన మాజీ మంత్రి కొడాలి నానిని ఓడించి చరిత్ర సృష్టించారు. అయితే వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తారన్న పేరున్న పీవీ సునీల్ కు సన్నిహితుడిగా, కీలకమైన కేసులో నిందితుడిగా ఉన్న తులసి బాబు కోసం రాము పరుగెత్తుకుంటూ రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
రాము అగ్రవర్ణాలకు చెందిన వారే అయినా… దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నారట. ఆ దళిత మహిళ… అంటే రాము సతీమణికి తులసి బాబు సమీప బంధువట. ఈ కారణంగానే పార్టీలు, వర్గాలు ఏవైనా… తన భార్య బంధువు అయిన తులసి బాబు కోసం రాము వచ్చారన్న మాట.
This post was last modified on January 10, 2025 6:17 pm
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…
బ్రాండ్ ఏపీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామని చెప్పారు.…
తిరుమల తొక్కిసలాట ఘటనపై శుక్రవారం సాయంత్రం టీటీడీ అత్యవసరంగా భేటీ అయి సమీక్షించింది. ఈ సమావేశంలో భాగంగా మృతుల కుటుంబాలకు…