తిరుమలలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటన సంచలనం రేపింది. ఆ ఘటనలో దాదాపు 40 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు ప్రభుత్వం తరఫున తాను క్షమాపణలు చెబుతున్నానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న అన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈ రోజు ఆ ఘటనకు బాధ్యత వహిస్తూ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణలు చెప్పి తీరాలి అంటూ ఈ రోజు పిఠాపురంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
తిరుమలలో తప్పు జరిగిందని, ఆ ఘటనకు సమిష్టిగా బాధ్యత వహించాలని, అందుకే తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై క్షమాపణలు చెప్పానని పవన్ అన్నారు. అంతేకాదు, ఆ ఘటనకు బాధ్యత వహిస్తూ టీడీపీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావు, టీటీడీ జేఈవో వెంకయ్య చౌదరి, టీటీడీ పాలకమండలి సభ్యులు క్షమాపణ చెప్పాలని పవన్ డిమాండ్ చేశాడు. తొక్కిసలాట ఘటనపై అందరూ క్షమాపణ చెప్పి తీరాలని డిమాండ్ చేశారు.
క్షమాపణ చెప్పేందుకు అధికారులకు ఎందుకు నామోషీ అని ప్రశ్నించారు. అధికారులు చేసిన తప్పు వల్ల ప్రజలు సంక్రాంతి సంబరాలు చేసుకోలేకపోతున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆకాశమంత పందిరి వేసి సంక్రాంతి సంబరాలు ఈ ఏడాది ఘనంగా జరుపుకుందామనుకున్నానని పవర్ చెప్పారు. కానీ, ఈ ఘటన నేపథ్యంలో సంబరాలు జరిపే పరిస్థితి లేదని అన్నారు.
ఆ తొక్కిసలాటలో గాయపడ్డ వారిని పరామర్శిస్తుంటే కన్నీళ్లు వచ్చాయని, తమ తలరాత బాగోలేదని వారు ఆవేదన చెందుతున్నారని పవన్ అన్నారు. అయినా సరే తమను దేవుడు కాపాడాడని బాధితులు తనతో అన్న మాటలను పవన్ గుర్తు చేసుకున్నారు.
అటువంటి వారికి కాకపోతే ఇంకెవరికి క్షమాపణలు చెబుతాం అని పవన్ ప్రశ్నించారు. మృతులు, బాధితుల ఇంటికి వెళ్లి క్షమాపణలు చెప్పాలని పవన్ అన్నారు. మరి, పవన్ వ్యాఖ్యలపై టీటీడీ ఛైర్మన్, ఈవోల రియాక్షన్ ఏవిధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on January 10, 2025 4:40 pm
బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టులు భిన్నమైన ఆదేశాలు ఇవ్వడం ఆసక్తిగా మారింది. ఏపీలో…
స్వలింగ వివాహాలకు చట్టబద్ధతకు నో.. తేల్చేసిన సుప్రీంస్వలింగ వివాహాలకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులపై దాఖలైన పిటిషన్లపై కీలక…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే విజన్కు పరాకాష్ఠ. ఆయన దూరదృష్టి.. భవిష్యత్తును ముందుగానే ఊహించడం.. దానికి తగిన ప్రణాళికలు వేసుకుని…
తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. అదేవిధంగా 38 మంది గాయపడ్డారు. వీరిలో మరో…
ఏం జరిగినా.. ఎంత జరుగుతున్నా.. కొన్ని కఠిన నిర్ణయాల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించే తీరు.. ఆయన్ను అమితంగా…