బ్రాండ్ ఏపీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా యువతకు ఉపాధి, ఉద్యోగాలు చూపించే రంగాల్లో కీలకమైన రియల్ ఎస్టేట్ రంగాన్ని గత వైసీపీ ప్రభుత్వం పాతిపెట్టిందని దుయ్యబట్టారు.
దీంతో కార్మికులు, ఉద్యోగులు, ఉపాధి ఇచ్చేవారు కూడా నష్టపోయారని తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందితే.. ప్రభుత్వానికి కూడా అన్ని రూపాల్లోనూ నిధులు సమకూరుతాయన్నారు.
కానీ.. గత పాలకులు దూరదృష్టితో ఆలోచన చేయలేకపోయారని.. అన్నింటినీ ధ్వంసం చేశారని అన్నారు. ఇప్పుడు వాటిని లైన్‌లో పెడుతున్నట్టు చెప్పారు. గుంటూరులో నిర్వహించిన ప్రాపర్టీ షోలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమివ్వనున్నట్టు చెప్పారు. బ్రాండ్ ఏపీ బిగిన్ అయిందని.. ఇక, రాష్ట్రం రూపు రేఖలు త్వరలోనే మా రుతాయని అన్నారు. వచ్చే ఏడాది నాటికి.. దాదాపు అన్ని ప్రాజెక్టులు సగానికి పైగా పూర్తి అవుతాయన్నారు.
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలను సరిచేసుకునేందుకే సమయం ఎక్కువగా పడుతోందన్నారు. అయినా..ఉచిత ఇసుక ను అమలు చేస్తున్నామని తెలిపారు. తద్వారా భవన నిర్మాణ రంగం డెవలప్ అవుతోందన్నారు.
కార్మికులకు చేతినిండా పని లభిస్తోందని చెప్పారు. నిర్మాణ రంగంపై 34 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని.. అందుకే రియల్ ఎస్టేట్ కు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు. వచ్చే రోజుల్లో భవన నిర్మాణ అనుమతులు అన్నీ ఒకే వేదిక నుంచి ఇస్తామని తెలిపారు.
అదేవిధంగా.. భూకబ్జాలపైనా తీవ్రంగా చర్యలు ఉంటాయని సీఎం హెచ్చరించారు. అనుమతులు తీసు కోకుండా నిర్మాణాలు చేయడం ఎంత తప్పో. కబ్జా చేసిన స్థలంలోనూ నిర్మాణాలు సాగించడం అంతే తప్పన్నారు. అందుకే అన్ని అనుమతులు ఇచ్చేలా ఒక పోర్టల్‌ను త్వరలోనే తీసుకువస్తామన్నారు. వైసీపీ పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
This post was last modified on January 10, 2025 3:44 pm
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…
భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…
యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…
నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…
ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…