Political News

అరస్ట్.. కేటీఆర్ అనుకున్నట్టు జరగలేదు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అరెస్ట్ భయంతో దాదాపుగా అల్లాడిపోయారనే చెప్పాలి. ఫార్ములా ఈ కారు రేసులకు సంబంధించి తనపై కేసు నమోదు కాగానే… తన అరెస్ట్ ఖాయమంటూ కేటీఆర్ ఓ అంచనాకు వచ్చేశారు. ఈ కారణంగానే తన అరెస్ట్ గురించి ఆయన పదే పదే ప్రస్తావించారు. అంతేకాకుండా అరెస్ట్ చేస్తే తానేమీ భయపడిపోనంటూ కూడా కేటీఆర్ పదే పదే చెప్పడమూ కనిపించింది. ఇక లాయర్ లేనిదే విచారణకు హాజరు కాలేనంటూ కేటీఆర్ చేసిన వాదన మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఓ పార్టీకి యువ రాజుగా, పదేళ్లకు పైగా మంత్రిగా పనిచేసిన కేటీఆర్… విచారణకు ఒంటరిగా హాజరు కావడానికి అంతలా వెనుకాడటంపై జనం కూడా ఓ రేంజిలో చర్చించుకున్నారు.

ఇక ఎట్టకేలకు లాయర్ ను వెంటబెట్టుకునే గురువారం కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. కేటీఆర్ ను ఏసీబీ బృందం ఓ గదిలో విచారిస్తూ ఉంటే…మరో గదిలో కూర్చున్న ఆయన లాయర్ విచారణను సాంతం పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు నిజంగానే ఆయనలోని అరెస్ట్ ఫోబియాను బయటపెట్టాయి. ఎక్కడనా విచారణలో ఆయా దర్యాప్తు సంస్థల అధికారులు నిందితులను ప్రశ్నిస్తారు గానీ…ఏసీబీ విచారణలో కేటీఆర్ అధికారులను వరుసబెట్టి ప్రశ్నలు అడిగారట,. అది కూడా కేవలం తన అరెస్ట్ గురించే ఆయన ఏసీబీ అదికారులను పదే పదే ప్రశ్నించారట.

నన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? ఈ రోజు నన్ను అరెస్ట్ చేస్తున్నారా? నా అరెస్ట్ ఖాయమే కదా. అయినా ఈ క్వశ్చనింగ్ అంతా ఫార్మాలిటీనే కదా. అరెస్ట్ కు ముందు ఏదో ప్రశ్నించాలని మాత్రమే విచారిస్తున్నారు కదా. రేపటి నుంచి పండుగ సెలవులు కదా. దీంతో ఈ రోజే నన్ను అరెస్ట్ చేస్తున్నారు కదా…ఇలా కేటీఆర్ నుంచి పదే పదే ప్రశ్నలు ఏసీబీ అధికారులకు ఎదురయ్యాయట. అసలే విచారణకు హాజరైన కేటీఆర్ కు తాము ప్రశ్నలు సంధించాల్సి ఉంటే… అందుకు విరుద్దంగా కేటీఆర్ నుంచి ఈ అరెస్ట్ ప్రశ్నలేమిటిరా బాబూ అంటూ ఏసీబీ అధికారులు తలలు పట్టుకున్నారట. ఇక సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మీరు ఇంటికి వెళ్లొచ్చు అంటూ ఏసీబీ అధికారులు చెప్పినంతనే… హమ్మయ్యా అంటూ లేచిన కేటీఆర్ హుషారుగా బయటకు వచ్చేశారట.

ఇదిలా ఉంటే… ఏసీబీ విచారణ అనంతరం ఏసీబీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన కేటీఆర్…ఇంటికి వెళ్లే క్రమంలో తొలుత బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ కు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ పెద్ద సంఖ్యలో గుమిగూడిన పార్టీ శ్రేణులు కేటీఆర్ కు ఘన స్వాగతం పలికారు. కేటీఆర్ అరెస్ట్ కాకుండా తిరిగి వచ్చారన్న భావన వారి ఆనందంలో చాలా స్పష్టంగా కనిపించింది. ఒకానొక దశలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ లు కేటీఆర్ ను తమ భుజాల పైకి ఎత్తుకుని మరీ కార్యాలయం లోపలికి తీసుకెళ్లారు. ఈ వీడియోలు గురువారం రాత్రి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మొత్తానికి అరెస్ట్ భయం కేటీఆర్ ను వెంటాడి వేధించిందనే చెప్పక తప్పదు.

This post was last modified on January 10, 2025 9:48 am

Share

Recent Posts

100 కోట్ల ప్రయాణాల స్త్రీ శక్తి!

ఏపీలో కూట‌మి స‌ర్కారు అమ‌లు చేస్తున్న స్త్రీ శ‌క్తి ప‌థ‌కం రికార్డ్ సృష్టించింది. గ‌త ఏడాది ప్రారంభించిన ఈ ప‌థ‌కం…

1 hour ago

నక్సలైట్ అడవుల్లో నవ్వుల ‘కళ్యాణ్’

అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…

1 hour ago

సంచలనం… లెజెండరీ ఇండియన్ కెప్టెన్ గుడ్‌బై

ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…

3 hours ago

బాబు పవన్ భేటీ… స్థానిక ముడి పడినట్టేనా?

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…

4 hours ago

గంప నిండా సినిమాలు… ఎక్కడయ్యా జనాలు

ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…

5 hours ago

జనాలు పట్టేశాక నిజాలు ఒప్పుకుంటే ఎలా?

ఏదైనా కథ, పాత్ర, లేదా పాట విషయంలో పాత సినిమాల నుంచి స్ఫూర్తి పొందడం కొత్తేమీ కాదు. ఐతే అలా…

5 hours ago