ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న కారణంగానే పోలీసులను ముందు పెట్టి తనను తిరుపతికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిందని ఆయన మండిపడ్డారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన వారిని ఆయన స్విమ్స్‌లో పరామర్శించారు. సుదీర్ఘంగా వారితో మాట్లాడారు. ఒక్కొక్క బాధితుడి వద్ద 5 నుంచి 10 నిమిషాల సేపు ఉన్నారు. అనంతరం.. జగన్ మీడియాతో మాట్లాడారు.
“తిరుపతిలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర చరిత్రలోనే లేదు. తొక్కిసలాటకు ఇంత మంది బలి కావడం గతం లో ఎప్పుడూ చూడలేదు. కానీ, ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది. దీనికి కారణాలు చూస్తే.. ఏటా వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజు శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం కొన్ని లక్షల మంది వస్తారు. ఆరోజు స్వామి వారిని దర్శిస్తే, మహా పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. అందుకే లక్షల మంది తరలి వస్తారు. ఆ దర్శనం కోసం టోకెన్లు ఇచ్చే కౌంటర్ల వద్ద ఎందుకు సెక్యూరిటీ కల్పించలేదు? టీటీడీ అధికారులు మొదలు జిల్లా కలెక్టర్ వరకు అందరూ దీనికి బాధ్యులు” అని వ్యాఖ్యానించారు.
“చంద్రబాబు తన నియోజకవర్గం కుప్పంలో మూడు రోజులు 6వ తేదీ నుంచి 8వరకు పర్యటించారు. ఆరోజు మధ్యాహ్నం వరకు ఆయన కుప్పంలోనే ఉన్నారు. మొత్తం సెక్యూరిటీ ఆయన దగ్గరే ఉంది. 8వ తేదీ రాత్రి 8.30 గంటలకు టోకెన్లు మొదలు పెట్టారు. లక్షల మంది వచ్చినా, తగిన సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదు. బైరాగి పట్టెడలోని రామానాయుడు స్కూల్‌లో ఏర్పాటు చేసిన టోకెన్ సెంటర్ వద్ద, భక్తులను ముందు పార్కులోనే ఉంచేసి రాత్రి ఒకేసారి వదిలేశారు. నిజానికి ఆ పార్కులో భక్తులకు కనీస సదుపాయాలు కల్పించలేదు” అని జగన్ చెప్పారు.
ఇంత జరిగినా, సీఎం చంద్రబాబు పద్ధతి లేకుండా మాట్లాడారని విమర్శించారు. ఎఫ్‌ఐఆర్ కూడా తప్పులతడకగా నమోదు చేశారని, సీఎం చంద్రబాబు మొదలు, కలెక్టర్, ఎస్పీ, టీటీడీ ఉన్నతాధికారులు, పోలీసులు.. అందరూ ఈ దుర్ఘటనకు బాధ్యులేనని చెప్పారు. ఇది సీఎం చంద్రబాబు సొంత జిల్లా. అయినా టీటీడీ బాధ్యతారహితంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం. ఘటనకు పూర్తిగా ప్రభుత్వానిదే బాధ్యత వహించాలని జగన్ డిమాండ్ చేశారు. అదేవిధంగా ఘటనలో చనిపోయిన వారికి కనీసం రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు.
సీఎం పగ్గాలు చేపట్టిన వెంటనే చంద్రబాబు.. శ్రీవారి లడ్డూ ప్రసాదంపైనా దుష్ప్రచారం చేశారని, అందుకే ఇవాళ ఆయన చర్య వల్లనే ఈ ఘటన జరిగిందని జగన్ వ్యాఖ్యానించారు. “చంద్రబాబుకు దేవుడంటే భయం, భక్తి లేదు. అందుకే తిరుమల ప్రసాదంపై కూడా ఆరోపణలు చేశారు. అబద్ధాలు ప్రచారం చేశారు” అన్నారు.
This post was last modified on January 9, 2025 8:57 pm
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…
ఒక హీరో దర్శకత్వం వహించి నిర్మించడమంటే మాములు విషయం కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ లాంటి లెజెండ్స్ దీన్ని సమర్ధవంతంగా…
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకునేందుకు వచ్చి భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఏపీ ప్రభుత్వం చర్యలు…