తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకునేందుకు వచ్చి భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ఘటనకు కారకులైన 2 మంది అధికారులపై చర్యలు తీసుకుంటూ సీఎం నారా చంద్రబాబునాయుడు కీలక ప్రకటన చేశారు. భక్తుల రద్దీపై నియంత్రణ లేకుండా అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీఎస్పీ రమణ కుమార్ సహా, బాధ్యత మరచి వ్యవహరించిన గోశాల డైరెక్టర్ హరినాధ రెడ్డిలపై సస్పెన్షన్ వేటు పడింది. అదే సమయంలో తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ జేఈవో గౌతమి, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీధర్ లను బదిలీ చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.
వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కోసం తిరుమలతో పాటు తిరుపతిలోనూ టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. అయితే టీటీడీ అంచనాలకు మించి బుధవారం ఉదయానికే తిరుపతికి భక్తులు లక్షల సంఖ్యలో పోటెత్తారు. సమయం పెరిగే కొద్దీ భక్తుల సంఖ్య కూడా పెరిగిపోయింది. అయితే గురువారం ఉదయం టోకెన్ల జారీ మొదలు అవుతుందని టీటీడీ ప్రకటించడంతో… బైరాగిపట్టెడలోని కౌంటర్ వద్ద భక్తులను అలాగే నిలిపేశారు. అయితే ఆ రద్దీ అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న డీఎస్పీ రమణ కుమార్… భక్తులందరినీ ఒకేసారి వదిలేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతోనే ఒక్కసారిగా తోపులాట జరిగిందని ప్రాథమికంగా తేల్చారు. ఈ కారణంగానే రమణ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఇక ఈ తంతును దగ్గరుండి చూస్తూ కూడా తనకేమీ పట్టనట్టు వ్యవరించారన్న భావనతో గోశాల డైరెక్టర్ గా కొనసాగుతున్న హరనాథరెడ్డిపైనా సస్పెన్షన్ వేటు వేశారు.
తిరుపతిలో బుధవారం ఉదయానికే భక్తులు భారీగా తరలివచ్చినా… అందుకనుగుణంగా భద్రతను ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారన్నది పోలీసు శాఖపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఈ కారణంగా జిల్లా పోలీసు యంత్రాంగానికి నేతృత్వం వహిస్తున్న కారణంగా జిల్లా ఎస్పీ సుబ్బారాయుడుపై బదిలీ వేటు పడింది. అదే సమయంలో పెరుగుతున్న రద్దీని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండటంతో పాటుగా… ఉన్నతాధికారులకు సమాచారం చేరవేసి అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాల్సిన జేఈవో గౌతమి ఆ పని చేయలేదన్న భావనతో ఆమెపైనా బదిలీ వేటు పడింది. ఇక రద్దీ గురించి పోలీసు శాఖకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయడంలో విఫలమయ్యారన్న కారణంగా చీఫ్ సెక్యూరిటీ అధికారి శ్రీధర్ పైనా బదిలీ వేటు వేశారు. మొత్తంగా ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా ఐదుగురు అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
This post was last modified on January 9, 2025 8:52 pm
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…
ఒక హీరో దర్శకత్వం వహించి నిర్మించడమంటే మాములు విషయం కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ లాంటి లెజెండ్స్ దీన్ని సమర్ధవంతంగా…