తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకోవాలన్న కోటి ఆశలతో వచ్చి ప్రాణాలు కోల్పోయిన వారిని తలచుకుంటేనే కన్నీళ్లు ఆగడం లేదు. వైకుంఠ ద్వార దర్శనం కోసం ఉద్దేశించిన టోకెన్ల పంపిణీ సందర్భంగా బుధవారం రాత్రి తిరుపతిలో జరిగిన తొక్కసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయిన సంగతి తెలిసిందే. మరో 40 మందికి గాయాలు కాగా… వారు తిరుపతిలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ తరహా ప్రమాదం జరగడం, భక్తులు ప్రాణాలు కోల్పోవడం తిరుమల చరిత్రలోనే లేదు. ఈ కారణంగానే ఈ ఘటనను ఏపీలోని కూటమి సర్కారు చాలా సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే తిరుపతిలో చంద్రబాబు పర్యటిస్తుండగా… మధ్యాహ్నానికే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా తిరుపతి చేరుకున్నారు.
తిరుపతి చేరుకున్న మరుక్షణమే పవన్ కల్యాణ్ నేరుగా ప్రమాదం జరిగిన స్థలం బరాగిపట్టెడ చేరుకున్నారు. టోకెన్ల జారీ కోసం ఏర్పాటు చేసిన కౌంటర్ వద్దే తొక్కిసలాట చోటుచేసుకోగా… పవన్ ఆ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అదికారులతో ఘటనకు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా టీటీడీ అంత భారీ ఏర్పాట్లు చేసినా… ఈ ఘటన ఎలా జరిగిందని ఆయన అదికారులను నిలదీశారు. అంతేకాకుండా కొందరు అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న భావనతో ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల కోసం ఏర్పాట్లు అయితే భారీగానే చేసినా… వాటిని పర్యవేక్షించాల్సిన అవసరం లేదా?అని ఆయన అదికారులను నిలదీశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా భక్తులు ప్రాణాలు కోల్పోయారంటూ ఆయన మండిపడ్డారు.
అటు సీఎం చంద్రబాబు, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు ఇద్దరూ.. అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమన్న రీతిలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. టీటీడీ, తిరుపతి జిల్లా రెవెన్యూ, పోలీసు యంత్రాంగంలో దాదాపుగా వణుకు మొదలైంది. సీఎం, డిప్యూటీ సీఎంలు అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో… నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆ 3 శాఖల అధికారులు ఓ అంచనాకు వచ్చేశారు. అయితే నిర్లక్ష్యం వహించిన వారి మీదే చర్యలు తీసుకుంటారా?..లేదంటే వారి పై అధికారులపైనా వేటు పడుతుందా? అన్న దానిపై చర్చ సాగుతోంది. తిరుమల చరిత్రలోనే ఈ తరహా ఘటన ఇప్పటిదాకా జరగని నేపథ్యంలో చర్యలు కూడా కాస్తంత కఠినంగానే ఉంటాయన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే… తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన అనంతరం పవన్ కల్యాణ్ నేరుగా… తిరుపతిలోని స్వీమ్స్ ఆసుపత్రికి వెళతారు. నిన్నటి తొక్కిసలాటలో గాయపడ్డ వారిలో చాలా మంది స్విమ్స్ లో చికిత్సపొందుతున్న సంగతి తెలిసిందే. దీంతో వారిని పరామర్శించేందుకే పవన్ కల్యాణ్ స్విమ్స్ ఆసుపత్రికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా బాధితులకు భరోసా ఇవ్వడంతో పాటుగా వారికి అందుతున్న వైద్య సేవలు, వారి ఆరోగ్య స్థితిగతులపై పవన్ వైద్యులతో మాట్లాడనున్నారు.
This post was last modified on January 9, 2025 5:00 pm
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…
ఒక హీరో దర్శకత్వం వహించి నిర్మించడమంటే మాములు విషయం కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ లాంటి లెజెండ్స్ దీన్ని సమర్ధవంతంగా…