Political News

షార్ట్ అండ్ స్వీట్!… సాగదీత, భజనలకు నో ఛాన్స్!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం టూర్ ప్రణాళికాబద్ధంగా సాగింది. మూడో దఫా ప్రధాని అయిన తర్వాత తొలిసారి ఏపీ పర్యటనకు మోదీ రావడంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. అంతేకాకుండా అటు మోదీతో పాటు ఇటు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు హాజరైన ఈ కార్యక్రమానికి అత్యంత భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు కూడా జరిగాయి. ఈ సందర్భంగా ముగ్గురు నేతలు కలిసి రోడ్ షో కూడా నిర్వహించారు. అయినా కూడా ఎక్కడ కూడా చిన్న పొరపాటు కూడా దొర్లలేదు. నిర్దేశిత సమయం కంటే కాస్తంత ఆలస్యంగా బహిరంగ సభ మొదలు అయినా… నిర్ణీత కాల వ్యవధిలోనే అది ముగియడం గమనార్హం.

కేంద్రంలో మాదిరే ఏపీలో కూడా కూటమి సర్కారే అధికారంలో ఉన్న నేపథ్యంలో మోదీ సభకు అటు టీడీపీ శ్రేణులతో పాటుగా ఇటు బీజేపీ, జనసేన శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలోనే హాజరయ్యాయి. అయినా కూడా సభా వేదిక మీద ముందుగా నిర్దేశించుకున్న ప్రకారమే.. 13 మంది నేతలకు మాత్రమే కుర్చీలు వేశారు. మిగిలిన నేతలంతా వేదిక ముందే కూర్చున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి గందరగోళం జరగకపోవడం గమనార్హం. సిరిపురం జంక్షన్ నుంచి ఆంధ్రా వర్సిటీ దాకా… కిలో మీటర్ మేర సాగిన ర్యాలీ కూడా అత్యంత ప్రశాంతంగా సాగడంతో భద్రతా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా భారీ సంఖ్యలో జనం స్వాగతం చెబుతుండగా… మోదీ, చంద్రబాబు, పవన్ లు అలా సాగిపోయారు. ర్యాలీలో ఈ ముగ్గురు నేతలతో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వాహనం ఎక్కినా… వారి వెనుక నిలుచున్న కారణంగా ఆమె జనానికి పెద్దగా కనిపించలేదనే చెప్పాలి.

ఇక ప్రజావేదిక పేరిట ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదికపై సాగిన నేతల ప్రసంగాలను ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. లోకల్ ఎంపీ హోదాలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తొలుత ప్రసంగించగా… ఆ తర్వాత మంత్రి నారా లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు ప్రసంగించారు. వీరు తమ ప్రసంగాల్లో సాగదీతలకు సాహసించకుండా…. క్లుప్తంగానే ప్రసంగించారు. అయినా కూడా తాము చెప్పాలనుకున్న విషయాన్ని వారు చాలా స్పష్టంగానే చెప్పేశారు. ఆ తర్వాత మైకు అందుకున్న సీఎం చంద్రబాబు ఒకింత సుదీర్ఘంగానే ప్రసంగించినా… సభికులను ఆకట్టుకునేలా ఆయన ప్రసంగించిన తీరు సభికులను ఆకట్టుకుందని చెప్పక తప్పదు. ఇక అతిథి హోదాలో మాట్లాడిన నరేంద్ర మోదీ కూడా తాను నిర్దేశించుకున్న సందేశాన్ని సూటిగా సుత్తి లేకుండా వెలువరించారు. ఈ సందర్భంగా ఏపీకి వెన్నుదన్నుగా నిలుస్తామన్న సందేశాన్ని మోదీ విస్పష్టంగా చెప్పారు. వెరసి మోదీ టూర్ పూర్తిగా ప్రణాళికాబద్ధంగానే సాగిందని చెప్పక తప్పదు.

This post was last modified on January 9, 2025 11:28 am

Share

Recent Posts

వెంకీ త్రివిక్రమ్ సినిమా స్థాయి బజ్ ఉందా?

సరిగ్గా ఇంకో పదకొండు రోజుల్లో ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల కానుంది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి మూడు వందల…

52 minutes ago

పబ్లిక్ టాయిలెట్‌లో ఇద్దరు యువకులు మృతి… ఏం జరిగింది?

ముంబైలోని గోరేగావ్‌లో పబ్లిక్ టాయిలెట్‌కు వెళ్లిన ఇద్దరు యువకులు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకేసారి ఇద్దరు చనిపోవడంతో అసలు లోపల…

1 hour ago

అనుమానం రాకుండా అంతర్ధానం అవుతోంది

చిన్న సినిమాల్లో విషయం ఉంటే ఆదరణ దక్కి తీరుతుంది. ఈ విషయంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. సీతాకోకచిలుక నుంచి…

2 hours ago

జడలు విదిలించిన వసూళ్లు… ఇకపై అసలు సవాళ్లు

బుధవారం ప్రీమియర్లతో గురువారం విడుదల ఎంచుకున్న ది ప్యారడైజ్ ఎట్టకేలకు మొదటి వీకెండ్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రాధమిక సమాచారం…

3 hours ago

అమ్మ చేతులు అడుక్కోకూడదు

తెలుగులో లెజెండరీ స్టేటస్ ఉన్న దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకడు. బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న…

3 hours ago

యువకుడి చెంప ఛెళ్లుమనిపించిన మంత్రి

ఈ మధ్యకాలంలో కొందరు రాజకీయ నేతలు తమను తాము వేరే లెవల్లో ఊహించుకుంటున్నారు. ప్రజలు ఎన్నుకుంటేనే తాము ప్రజాప్రతినిధులుగా చలామణీ…

4 hours ago