ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడో సారి ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఏపీ పర్యటనకు వచ్చారు. బుధవారం విశాఖ వచ్చిన ఆయనకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజా వేదిక పేరిట ఆంధ్రా వర్సిటీలో ఏర్పాటు చేసిన బహిరంగ వేదిక మీద ఏపీలో చేపట్టిన, చేపట్టనున్న పలు అభివృద్ధి పథకాలకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన కూటమి పార్గీల నేతలు మోదీని ఆకాశానికెత్తేశారు. అనకాపల్లి ఎంపీ హోదాలో బీజేపీ ఎంపీ సీఎం రమేశ్, ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి నారా లోకేశ్, డిప్యూటీ సీఎం హోదాాలో పవన్ కల్యాణ్ లు మోదీని తమదైన శైలి పదాలతో ప్రస్తుతించారు.
ఇక ఏపీ సీఎం హోదాలో ప్రసంగించిన చంద్రబాబు.. సభకు హాజరైన జనాలను ఉర్రూతలూగించారు. ఇక రాష్ట్రానికి అతిథిగా విచ్చేసిన మోదీని ఆయన ఆనందాతిశయాల్లో ముంచెత్తారు. మోదీ విజన్ ను పదే పదే ప్రప్తావించిన చంద్రబాబు… మోదీని ఆకాశానికెత్తేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నోట నుంచి వచ్చిన ఓ పదం . జనంతో పాటు మోదీని కూడా విశేషంగా ఆకట్టుకుంది. ఎక్కడికెళ్లినా భారతీయులకు మోదీ భారీ రూపం వారి కళ్ల ముందు కదలాడుతుందని చెప్పిన చంద్రబాబు… మోదీ ఓ గ్లోబల్ లీడర్ అంటూ మెస్మరైజంగ్ కామెంట్ చేశారు. ఈ ప్రశంసకు మంత్రముగ్ధుడైన మోదీ…అందుకు ప్రతిగా చంద్రబాబుకు చేతులెత్తి నమస్కారం చేశారు. తానెంతో మంది ప్రధాన మంత్రులను చూశానని… అయితే మోదీ లాంటి నేత తనకు ఇంతవరకు కనిపించలేదన్నారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను చెప్పిన ప్రతి విషయానికి ఓకే చెప్పిన మోదీ… తనను వెన్నుతట్టి ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా పలు అంశాలను చంద్రబాబు ప్రప్తావించారు. తానేదో మోదీని పొగడుతున్నానని అనుకోవడానికి వీల్లేదన్న చంద్రబాబు… తాను చెబుతున్న విషయాలన్నీ ఇటీవలి కాలంలోనే చోటుచేసుకున్నాయని తెలిపారు. ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ ప్రతిపాదించినట్లుగా ఐరన్ ఓర్ ను తరలించేందుకు పైప్ లైన్ కావాలంటే మోదీ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పచ్చ జెండా ఊపారన్నారు. అదే విధంగా గూగుల్ కంపెనీతో చర్చల సందర్భంగా తాను చేసిన ప్రతిపాదనప ఆయా కంపెనీల ప్రతినిధులు పెదవి విరవగా..సరికొత్త పన్ను విధాల కారణంగా కొంతమేర వ్యతిరేకత వచ్చినా ముందుకు సాగుదామని మోదీ అభయహస్తం ఇచ్చారని తెలిపారు. అంతేకాకుండా ఈ విధానం ద్వారా నష్టం వచ్చినా భరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మోదీ తనకు వెన్నుదన్నుగా నిలిచారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు ప్రసంగం సాగుతున్నంత సేపూ మోదీ మోములో చిరునవ్వు ఒక్క క్షణం కూడా మాయం కాలేదు.
This post was last modified on January 9, 2025 11:26 am
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…
ఒక హీరో దర్శకత్వం వహించి నిర్మించడమంటే మాములు విషయం కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ లాంటి లెజెండ్స్ దీన్ని సమర్ధవంతంగా…