Political News

ఇంట‌ర్ ప‌రీక్ష‌ల ర‌ద్దు లేదు.. ఆ వార్త‌లు న‌మ్మొద్దు: ఏపీ ప్ర‌భుత్వం

ఏపీలో కీల‌క‌మైన ఇంట‌ర్మీడియెట్ తొలి సంవ‌త్స‌రం ప‌రీక్ష‌లు ర‌ద్దు చేశార‌ని, రెండేళ్లుక‌లిపి ఒకేసారి నిర్వ‌హిస్తున్నార‌ని పేర్కొం టూ.. బుధ‌వారం మ‌ధ్యాహ్నం నుంచి ప‌లు సామాజిక మాధ్య‌మాల్లో వార్త‌లు హ‌ల్చ‌ల్ చేశాయి. ఇది విద్యార్థుల‌కు ఊర‌ట‌నిచ్చే అంశంగా కొంద‌రు పేర్కొన్నారు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక చేప‌ట్టిన భారీ సంస్క‌ర‌ణ‌గా కూడా ప్ర‌చారంలోకివ‌చ్చింది. ఇది క్ష‌ణాల్లోనే వైర‌ల్ అయింది. అయితే.. ఆ వెంట‌నే ప్ర‌భుత్వం దీనిపై స్పందించింది. ప‌రీక్ష‌ల ర‌ద్దు అనేది ఏమీ లేద‌ని.. ఇవివదం తులేన‌ని ఇంట‌ర్మీడియెట్ బోర్డు కార్య‌ద‌ర్శి కృతికా శుక్లా క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి ప్ర‌చారాల‌ను ప్ర‌జ‌లు న‌మ్మొద్ద‌ని సూచించారు.

కేవలం విద్యా విధానంలో సంస్క‌ర‌ణ‌ల‌కు మాత్ర‌మే పెద్ద పీట వేస్తున్న‌ట్టు తెలిపారు. ఆయా సంస్క‌ర‌ణ‌ల‌పైనా విద్యార్థుల త‌ల్లిదండ్రుల నుంచి అదేవిధంగా మేధావులు, విద్యావేత్త‌ల నుంచి కూడా స‌ల‌హాలు కోరుతున్న‌ట్టు తెలిపారు. ఈ నెల 26లోగా ప్ర‌జ‌లు త‌మ అభిప్రాయాలను biereforms@gmail.com కు మెయిల్ చేయవ‌చ్చ‌ని పేర్కొన్నారు. ఇంట‌ర్ విద్యా విధానంలో తీసుకువ‌చ్చే ప్రతిపాదిత సంస్కరణల విధానాలను http://bieap.gov.in అనే వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచిన‌ట్టు పేర్కొన్నారు.

ఇత‌ర రాష్ట్రాల్లో ఇలా..

ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు మిన‌హా ఇత‌ర రాష్ట్రాల్లో ఇంట‌ర్మీడియెట్ మొద‌టి సంవ‌త్స‌రం ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌డం లేద‌ని కృతికా శుక్లా తెలిపారు. దీనివ‌ల్ల విద్యార్థుల‌పై ఒత్తిడి త‌గ్గించాల‌న్న ఉద్దేశం ఉంద‌న్నారు. అయితే.. ఈ విధానాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు అమ‌లు చేయ‌డం లేద‌న్నారు. రెండో సంవ‌త్స‌రంలో మాత్రం యూనివ‌ర్సిటీ నేతృత్వంలో ఇంట‌ర్మీడియెట్ రెండు సంవ‌త్స‌రాల‌కు క‌లిపి ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నార‌ని చెప్పారు. అయితే.. ఈ విధానంపై ఏపీ ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేస్తోంద‌ని.. దీనిపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌న్నారు. మ‌రో వైపు జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా విద్య‌లో సంస్క‌ర‌ణ‌లు తీసుకురావా లని స‌ర్కారు నిర్ణ‌యించిన‌ట్టు తెలిపారు. దీనిపైనా క‌స‌ర‌త్తు సాగుతోంద‌న్నారు. ఇక‌, ఇంట‌ర్‌లో 2025-26 సంవ‌త్స‌రం నుంచిపూర్తిగా సీబీఎస్ ఈ(సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్)ని ప్ర‌వేశ పెట్ట‌నున్న‌ట్టు పేర్కొన్నారు. 

This post was last modified on January 8, 2025 11:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తిరుప‌తి క్యూలైన్లో తోపులాట‌.. ఎంత మంది చనిపోయారు

ఈ నెల 10 శుక్ర‌వారం నాడు వైకుంఠ ఏకాద‌శిని పుర‌స్క‌రించుకుని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌త్యేక స‌ర్వ‌ద‌ర్శ‌న టోకెన్ల పంపిణీని…

10 hours ago

న‌మో-న‌మో-న‌మో.. నారా లోకేష్ 21 సార్లు!

ఏపీ మంత్రి, టీడీపీ యువ నేత నారా లోకేష్ త‌న ప్ర‌సంగంలో ఏకంగా 21 సార్లు న‌మో అనే ప‌దాన్ని…

11 hours ago

మోదీ, పవన్ పై చంద్రబాబు ప్రశంసలు

విశాఖ బహిరంగ సభలో ప్రధాని మోదీని ఉద్దేశించి ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం మెచ్చే ఏకైక…

11 hours ago

తెలుగులో మోదీ స్పీచ్ కు ఫిదా!

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర కేంద్ర, రాష్ట్ర మంత్రులకు, రాష్ట్ర…

12 hours ago

ఏపీకి ప్ర‌ధాని ఇచ్చిన వ‌రాల ప్రాజ‌క్టులు ఇవీ..

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌లు గంటున్న ల‌క్ష్యాల‌ను సాకారం చేసేందుకు తాము అండ‌గా ఉంటామ‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ…

12 hours ago

ప్రభాస్ ఫౌజీ హీరోయిన్ డిమాండ్ చూశారా

మొన్నటిదాకా అసలెవరో తెలియని ఇమాన్వి ఇస్మాయిల్ ప్రభాస్ సరసన హీరోయిన్ గా ఎంపిక కాగానే ఒక్కసారిగా ఇతర బాషల నిర్మాతల…

13 hours ago