ఏపీ సీఎం చంద్రబాబు కలలు గంటున్న లక్ష్యాలను సాకారం చేసేందుకు తాము అండగా ఉంటామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఆయన లక్ష్యాలు తమవిగా భావిస్తామని చెప్పారు. విశాఖ పర్యటనలో భాగంగా 2.3 లక్షల కోట్ల రూపాయల అభివృద్ది పనులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రధాని మాట్లాడా రు. తొలుత తెలుగులోనే ఆయన ప్రసంగం ప్రారంభించారు. అనంతరం హిందీలో కొనసాగించారు. హిందీ అనువాదం కేంద్ర మంత్రి, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని ఏపీని అభివృద్ది చేసే బాధ్యతను తాము తీసుకుంటామని చెప్పడం గమనార్హం.
ఏపీ ప్రజల ఆశయాలను నెరవేరుస్తామని ప్రధాని మోడీ తెలిపారు. అన్ని విధాలా ఏపీకి మద్దతుగా ఉంటామన్నారు. ఏపీతో అన్ని రంగాల్లోనూ కలిసి ముందుకు సాగుతామన్నారు. బుధవారం శంకుస్థాపనలు చేసిన, ప్రారంభించిన పలు ప్రాజక్టులు ఏపీకి అన్ని విధాలా దోహద పడతాయని, అభివృద్ధి పథంలో రాష్ట్రాన్నిముందుండి నడిపిస్తాయని పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఐటీ, టెక్నాలజీకి ఏపీ ప్రధాన కేంద్రం కానుందని పేర్కొన్నారు. ఏపీలో ఐదేళ్ల తర్వాత.. తిరిగి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిందన్న మోడీ.. అభివృద్ధికి చిరునామాగా మార్చేందుకు తాము కృషి చేస్తామని చెప్పారు. ఈ విషయంలో ఏపీ ప్రజలకు మోడీ హామీ ఇస్తున్నారని చెప్పారు.
చంద్రబాబుపై పొగడ్తలు..
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై మోడీ ప్రశంసల జల్లు కురిపించారు. దార్శనికతకు సీఎం చంద్రబాబు మారుపేరుగా పేర్కొ న్నారు. ఆయన ముఖ్యమంత్రిగానే ఉన్నా.. దేశం గురించి ఆలోచించే అతి తక్కువ మంది నాయకుల్లో ముందుంటారని తెలిపారు.
ఆయన సీఎం కావడం.. ఏపీ చేసుకున్న అదృష్టంగా పేర్కొన్నారు. నిరంతరం ఆయన రాష్ట్రం కోసం.. ప్రజల కోసం ఆలోచిస్తు న్నారని తెలిపారు. ప్రతి రంగంలోనూ అభివృధ్ధి సాధించాలని కలలు కంటున్నారని, ఆయనకు అన్ని విధాలా అండగా ఉంటామ ని తెలిపారు. చంద్రబాబు తన ప్రసంగంతో ఇరగదీశారని కొనియాడారు.
వరాలు ఇవే..
ఏపీకి ప్రధాని ఇచ్చిన వరాల ప్రాజక్టులు ఇవీ..
This post was last modified on January 8, 2025 8:40 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…