తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా వెలుగు చూసిన హెచ్ ఎంపీవీ వైరస్ విషయంలో వ్యక్తిగత జాగ్రత్తలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కార్యాలయం కొన్ని నియమనిబంధనలను తాజాగా విడుదల చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయాని కి వచ్చేవారు తప్పని సరిగా మాస్కులు పెట్టుకోవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రితో కరచాలనాలు వద్దని.. కేవలం నమస్కారా లకే పరిమితం కావాలని పేర్కొన్నారు. అదేవిధంగా ఈ నిబంధనలు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని కూడా పేర్కొన్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో హెచ్ఎంపీవీ కేసు నమోదు కాకపోయినా.. విదేశీ పౌరులు, ఇతర ప్రాంతాలకు వచ్చి వెళ్లేవారు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నిబంధనలను తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం సంక్రాంతి సీజన్ కావడం, త్వరలోనే కుంభమేళా కూడా ప్రారంభం అవుతున్న నేపథ్యంలో వైరస్ విషయంలో అన్ని వయసుల వారు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. జలుబు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పి, ముక్కు కారడం వంటి లక్షణాలు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని నిబంధనల్లో పేర్కొన్నారు.
ప్రత్యేకించి- చిన్నపిల్లలు, వయోధిక వృద్ధులు వైరస్ బారిన పడే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ప్రజలు కొన్ని సూచనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని కోరారు. దగ్గు, తుమ్ముతున్నప్పుడు నోటికి లేదా ముక్కుకు హ్యాండ్ కర్చీఫ్ లేదా టిష్యూ పేపర్ను అడ్డు పెట్టుకోవాలి. సన్నిహితులకు, మిత్రులకు, కుటుంబ సభ్యులకు కూడా కరచాలనం చేయకుండా ఉండాలని పేర్కొన్నారు. శానిటైజర్తో తరచూ చేతులను శుభ్రపర్చుకోవాలి. గుంపుగా ఉండే రద్దీ ప్రదేశాలకు వెళ్లకూడదు. అలాంటి ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలి.
This post was last modified on January 7, 2025 10:00 pm
ప్రస్తుతం ఐటీ రంగంలో ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం దేశవ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగులు బెంగళూరుకు క్యూ కడుతున్నార ని.. భవిష్యత్తులో కుప్పానికి…
హిట్లు ఫ్లాపులు పక్కనపెడితే విజయ్ దేవరకొండ నిర్మాతలు బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా భారీ ప్యాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు.…
పది రోజుల క్రితం వచ్చిన లీక్ నిజమయ్యింది. పుష్ప 2 ది రూల్ కు అదనంగా 20 నిమిషాల ఫుటేజ్…
ఇటీవలే స్ట్రీమింగ్ మొదలుపెట్టిన అన్ స్టాపబుల్ 4 డాకు మహారాజ్ ఎపిసోడ్ లో బాలయ్య దర్శకుడు బాబీతో జరిపిన సంభాషణలో…
ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్లలో ఒకడిగా ఉండేవాడు దిల్ రాజు. ప్రతి సినిమాతో హిట్టు కొట్టడం ఎవరికీ…