Political News

ఎలాన్ మస్క్ పై బ్రిటన్ ప్రధాని ఫైర్!

ఒకప్పుడు రవి ఆస్తమించని బ్రిటన్ సామ్రాజ్యంగా పేరున్న ఇప్పటి గ్రేట్ బ్రిటన్.. తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రపంచ రాజకీయాల్లో ఇప్పటివరకు చూడని సిత్రమైన చిన్నెల్ని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చూపిస్తున్నారు. తజాగా బ్రిటన్ ప్రభుత్వంపై తన సోషల్ మీడియాలో మస్క్ సంధించిన ఒక ప్రశ్న.. బ్రిటన్ ప్రధానమంత్రికి ఒళ్లు మండేలా చేస్తోంది.

అంతేకాదు.. బ్రిటన్ ప్రజాస్వామ్యాన్నిబలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మస్క్ మీద నిప్పులు చెరిగారు. బ్రిటన్ ప్రధానిగా వ్యవహరించిన భారత మూలాలు ఉన్న రిషి సునక్ అధికారం నుంచి తప్పుకొని.. లేబర్ పార్టీ పవర్ లోకి వచ్చిన తర్వాత నుంచి సదరు ప్రభుత్వంపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. విమర్శలు గుప్పిస్తున్నారు.

స్టార్మర్ ను ప్రభుత్వం నుంచి తప్పించి.. కొత్తగా ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై బ్రిటన్ ప్రధాని మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల చోటుచేసుకున్న లైంగిక వేధింపుల కేసుల్లో ప్రభుత్వ తీరును తప్పు పట్టిన మస్క్.. తాజాగా తన ఎక్స్ ఖాతాలో ఒక పోల్ పెట్టారు. ‘నిరంకుశ ప్రభుత్వం నుంచి బ్రిటన్ ప్రజలకు అమెరికా విముక్తి కల్పించాలా?’ అంటూ చేపట్టిన పోల్ కు ఐదు లక్షల సంఖ్యలో రియాక్షన్లు వచ్చినట్లుగా ప్రపంచ కుబేరుడు ప్రకటించారు.

అయితే.. మస్క్ తీరును బ్రిటన్ ప్రధాని తప్పు పడ్డారు. తమ ప్రభుత్వం పట్ల తప్పుడు ప్రచారాన్ని చేపడుతున్నట్లుగా వ్యాఖ్యానించారు. మరోవైపు మస్క్ తీరును పలు దేశాలు తప్పు పడుతున్నాయి. ఇతర దేశాల రాజకీయాల్లోనూ ఎలాన్ మస్క్ జోక్యం చేసుకోవటం ఆందోళన కలిగిస్తోందని నార్వే ప్రధానమంత్రి జోనాస్ గహర్ స్టోరేగా పేర్కొన్నారు.

ఆర్థిక వనరులు భారీ స్థాయిలో ఉన్న మస్క్ తరహా వ్యక్తి ఇతర దేశాల అంతర్గత విషయాల్లో జోక్యంచేసుకోవటం మంచి పరిణామం కాదని నార్వే ప్రధాని తప్పు పడుతున్నారు. ఇదంతా చూసినప్పుడు ఎలాన్ మాస్క్ కు కావాల్సింది.. ఆయనకు నచ్చిన వ్యక్తుల చేతుల్లోనే ప్రభుత్వాలు ఉండాలని భావిస్తున్నారా? అన్నది ప్రశ్నగా మారింది. ఒకవేళ ఈ వాదనే నిజమైతే మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దేశాలకు కొత్త ముప్పు పొంచి ఉన్నట్లే.

This post was last modified on January 7, 2025 1:42 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

3 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

7 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

9 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

10 hours ago