Political News

‘కుప్పం’ రుణం తీర్చుకుంటున్న చంద్ర‌బాబు!

రాష్ట్రానికి సంబంధించి విజ‌న్‌-2047 ఆవిష్క‌రించిన సీఎం చంద్ర‌బాబు.. తాజాగా త‌న సొంత నియోజ‌క వ‌ర్గం.. 35 ఏళ్ల నుంచి వ‌రుస విజ‌యాలు అందిస్తున్న కుప్పం నియోజ‌క‌వ‌ర్గం రుణం తీర్చుకునేందుకు కూడా రెడీ అయ్యారు. దీనిలో భాగంగా ఆయ‌న సుదీర్ఘ‌కాలం త‌న పేరు చిర‌స్థాయిగా ఉండేలా.. స్వర్ణ కుప్పం విజన్ -2029.. ఫ్యూచ‌ర్ ప్లాన్‌ను విడుద‌ల చేశారు. సోమ‌వారం త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన సీఎం చంద్ర‌బాబు.. ఈ డాక్యుమెంట‌ర‌నీ విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం.

ఏంటి స్పెష‌ల్‌?

ఇటీవ‌ల విజ‌న్ -2047 విడుద‌ల చేసిన చంద్ర‌బాబు.. వ‌చ్చే 25 ఏళ్ల‌లో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాల న్న విష‌యంపై ప‌క్కా ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందించారు. ఉపాధి, ఉద్యోగాలు, స్వావ‌లంబ‌న‌, మ‌హిళ‌ల అభ్యున్న‌తి, సాంకేతిక‌తకు పెద్ద‌పీట‌, విద్యా వ్య‌వ‌స్థ‌లో స‌మూల మార్పులు వంటివాటిని ఆయ‌న ప్ర‌ధానం గా ప్ర‌స్తావించారు. అలానే ఇప్పుడు త‌న నియోజ‌క‌వ‌ర్గానికి ప‌రిమితం అవుతూ.. ఇలానే విజ‌న్‌ను ఆవిష్క‌రించారు. దీనిలో భాగంగా కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దనున్నారు.

ఇవీ ల‌క్ష్యాలు..

  • కుప్పం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని 3 లక్షల మందికి పైగా ఉపాధి అకాశాలు కల్పిస్తారు.
  • పాడి పరిశ్రమ అభివృద్ధికి పెద్ద‌పీట వేయ‌నున్నారు.
  • కేవలం కుప్పం నియోజ‌క‌వ‌ర్గానికి రెండు కొత్త డెయిరీలు తీసుకువస్తారు.
  • నియోజకవర్గంలో సుమారు రూ.15 వందల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు వ‌చ్చే నాలుగేళ్ల‌లో పూర్తి చేయ‌నున్నారు.
  • ప్ర‌తి ఇంటికీ సౌర విద్యుత్‌ను అందించేలా ఏర్పాట్లు చేస్తారు.

This post was last modified on January 6, 2025 6:34 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

4 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

5 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

5 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

6 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

6 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

6 hours ago