ఏకంగా 7500 కోట్ల రూపాయలను మంచి నీళ్ల ప్రాయంలా ఖర్చు చేశారు. మరో వారం రోజుల్లో మహా క్రతువ ను ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేశారు. రేయింబవళ్లు వేలాదిగా కార్మికులు, వందల సంఖ్యలో అధికారులు కంటిపై కునుకు లేకుండా కష్టపడుతున్నారు. ఇదంతా సదరు క్రతువును నిర్విఘ్నంగా పూర్తి చేయడం కోసమే. కానీ, ఇప్పుడు ఈ 7500 కోట్ల ఖర్చును మింగేసేలా కంటికి కనిపించని శత్రువు ముప్పుగా మారింది. దీంతో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా తల పట్టుకుంటున్నాయి.
విషయం ఏంటంటే..
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో ఈ నెల 13న మకర సంక్రాంతిని పురస్కరించుకుని మహా కుంభ మేళాను ప్రారంభిస్తున్నారు. వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ మహా కుంభ మేళాను యోగి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మంచి నీళ్ల ప్రాయంగా నిధులు ఖర్చు చేస్తోంది. దేశవ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా కూడా హిందువులను ఆకర్షించి.. ఆహ్వానించి.. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నిర్ణయించింది.
కానీ, ఇంతలోనే చైనా నుంచి హ్యూమన్ మెటా న్యుమో వైరస్(హెచ్ ఎంపీవీ) దేశంలోకి కూడా ప్రవేశించిం ది. తాజాగా బెంగళూరు, సహా మరో రాష్ట్రంలోనూ ఈ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతానికి ఈ వైరస్‌తో ప్రాణాపాయం లేకున్నా.. తమ్ములు, దగ్గు, ఒళ్లు నొప్పులు, వికారం, గొంతునొప్పి, జ్వరం లక్షణాలతో ఇబ్బందులు పడుతున్న వారు పెరుగుతున్నారు. పైగా హెచ్ ఎంపీవీ అనేది అంటు వ్యాధి. సెకనుల వేగంతో ఇది వ్యాపిస్తోంది. దీంతో ఇప్పుడు ఈ కంటికి కనిపించని శత్రువు మహా కుంభ మేళాపై ఏమేరకు ప్రభావం చూపుతుందనేది పెద్ద చిక్కుగా మారింది.
అయితే.. మహా కుంభమేళాను వాయిదా వేసే పరిస్థితి లేదు. కానీ, హెచ్ ఎంపీవీ వైరస్ కనుక తగ్గుముఖం పట్టకపోతే.. భక్తులను కూడా అనుమతించే పరిస్థితి ఉండదు. సో.. ఇదే జరిగితే.. ఇప్పటి వరకు చేసిన 7500 కోట్ల రూపాయల ఖర్చు బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా మారనుంది. ఈ విషయంపైనే.. ఇప్పు డు కేంద్ర, యూపీ ప్రభుత్వాలు తర్జన భర్జన పడుతున్నాయి. గతంలో కరోనా కూడా ఇలానే సైలెంట్‌గా వ్యాపించింది. ఇప్పుడు హెచ్ ఎంపీవీ వంతు వచ్చింది. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on January 6, 2025 6:30 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…