ప్రగతి రథం రైలు బండి పోతున్నాది.. అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాడుకుంటున్నారు. ఏడాది పాలనలో తెలంగాణలో సీఎం రేవంత్ సర్కారు అనేక మెరుపులు మెరిపించింది. ఉద్యోగాలు, ఉపాధి, రైతు రుణమాఫీ, బస్సు ప్రయాణాలు వంటివి అందిస్తూనే.. మరోవైపు.. అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది.
తాజాగా ఈ విషయాలనే సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. దేశంలో ఏ ప్రభుత్వమూ ఇప్పటి వరకు చేయని విధంగా ఏడాది పాటు తాము ప్రజలపై వరాల జల్లు కురిపించినట్టు చెప్పారు.
తాజాగా ప్రజాభవన్(గతంలో ప్రగతి భవన్)లో నిర్వహించిన రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయ హస్తం కార్యక్ర మంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కింద శిక్షణ పూర్తి చేసుకుని మెయిన్స్ దాటి ఇంటర్వ్యూ వరకు వెళ్లిన వారికి ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున రేవంత్ రెడ్డి సాయం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాము అధికారం చేపట్టిన కేవలం ఏడాది కాలంలోనే 55,143 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినట్టు ముఖ్యమంత్రి చెప్పారు.
సివిల్స్‌కు ఎంపిక అయినప్పటికీ.. ఎక్కడ పనిచేసినా.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని ఆయన యాస్పిరెంట్స్‌ను కోరారు. పది సంవత్సరాలుగా నిరుద్యోగ సమస్యను ఎవరూ పట్టించుకోలేదంటూ.. గత బీఆర్ఎస్ సర్కారుపై ఆయన నిప్పులు చెరిగారు.
నిరుద్యోగాన్ని తగ్గించేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూనే ఉందన్నారు. కానీ, కొందరు తమ ప్రయత్నాలకు అడ్డు పడుతున్నారని.. అయినా న్యాయపోరాటాలతో అన్ని స్థాయిల్లోనూ విజయం దక్కించుకుంటున్నట్టు తెలిపారు.
కేవలం ఏడాది పాలనలో అనేక మార్పులు తీసుకువచ్చామని సీఎం రేవంత్ చెప్పారు. ఉద్యోగాల నుంచి ఉపాధి వరకు అన్ని విషయాల్లోనూ ప్రభుత్వం ప్రగతి పథంలో ముందుకు సాగుతోందన్నారు. అయినప్ప టికీ.. గత పదేళ్ల అలసత్వం.. నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు అభివృద్ధి సుమాలు అందలేదన్నారు. తాము చేపట్టిన అనేక కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేస్తున్నట్టు చెప్పారు.
This post was last modified on January 5, 2025 5:21 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…