తెలుగు సినీ పరిశ్రమను అమరావతి రాజధానికి తీసుకు వస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. అమరావతి నిర్మాణం పూర్తయితే.. అన్ని రంగాల మాదిరిగానే సినీ పరిశ్రమకు కూడా ఇక్కడ మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఒకప్పుడు హైదరాబాద్‌లో చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఇప్పుడు హైదరాబాద్.. సిని పరిశ్రమకు హబ్‌గా మారింది. ఇది టీడీపీ ప్రభుత్వం వేసిన అడుగుల కారణంగానే సాధ్యమైంది. అదేవిధంగా అమరావతిలో కూడా అడుగులు వేస్తున్నాం. అమరావతి నిర్మాణం పూర్తి అయ్యేలోగానే సినీ పరిశ్రమను ఇక్కడకు ఆహ్వానిస్తాం. ఇక్కడ వారికి మంచి భవిష్యత్తు తో పాటు.. మంచి మార్కెట్ కూడా లభిస్తుంది
అని చంద్రబాబు అన్నారు.
బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరించారు. 2024 ఒక గేమ్ ఛేంజర్‌గా నిలిచిందని వ్యాఖ్యానించారు. చరిత్రను మలుపు తిప్పిన సంవత్సరంగా ఆయన పేర్కొన్నారు. ఐదేళ్లపాటు ప్రజలు పడిన కష్టాలకు 2024 మార్పు చూపించిందన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారని.. వారి నమ్మకాన్ని నిలుబెట్టుకుంటామని చెప్పారు. తమ పాలనలో అధికారులు.. కూడా ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ఆయన చెప్పారు. కూటమి ప్రబుత్వంపై ప్రజలకు చాలానే ఆశలు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. వారి ఆశల మేరకు ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు.
పాలనతో పాటు అధికారులను కూడా..
జగన్ తన పాలనతో రాష్ట్రాన్ని ధ్వంసం చేశారని విమర్శలు గుప్పించిన చంద్రబాబు.. ఆయన హయాంలో అధికారులను కూడా దొడ్డిదారిలో నడిపించారని విమర్శించారు. తన చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు అధికారులను కూడా బెదిరించారని అన్నారు. వారు కూడా చేసేది లేక.. అదే తప్పుడు మార్గంలో కొందరు నడిచారని.. మరికొందరు ఇక్కడ చేయలేమని కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారని చెప్పారు. ఐదేళ్ల పాటు అధికారులు కూడా అనేక ఇబ్బందులు పడ్డారని చెప్పారు. వారు కూడా.. జగన్ ఎప్పుడు పోతాడా? అని ఎదురు చూసినట్టు చెప్పడం గమనార్హం.
ఎమ్మెల్యేలు మారాలి..
కూటమి పార్టీల ఎమ్మెల్యేల్లో కొందరిపై విమర్శలు వస్తున్న విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ఎమ్మెల్యేలు అందరికీ పదే పదే తాను కౌన్సెలింగ్ ఇస్తున్నానని.. తప్పులు చేయొద్దని, సివిల్ కేసుల్లో తలదూర్చవద్దని కూడా చెబుతున్నానని తెలిపారు. అయినా.. కొందరు మాట వినిపించుకోవడం లేదన్న విషయం కూడా తన దృష్టికి వచ్చిందన్నారు. అలాంటివారిని తాను వదిలి పెట్టేది లేదన్నారు. కొందరు వారు చెప్పినట్టు నేను వినాలనికోరుకుంటున్నారు. కానీ, నేను చెప్పేదే ఫైనల్ అన్న విషయాన్ని వారుఎందుకో మరిచిపోతున్నారు. ఇది సరైన విధానం కాదు. ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు ప్రజల కోసం పనిచేయాలి
అని చంద్రబాబు అన్నారు.
This post was last modified on January 1, 2025 10:09 pm
చైనాలో హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటాప్న్యుమో వైరస్) వైరస్ కారణంగా ఆసుపత్రుల్లో రద్దీ పెరిగిందన్న వార్తలను చైనా ప్రభుత్వం ఖండించింది. ఈ…
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రంలో కొత్తగా ఏడు విమానాశ్రయాలు నిర్మించేందుకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టులు ఆర్థిక, వాణిజ్య…
గత దశాబ్ద కాలంలో తెలుగు సినిమాలో వేగంగా ఎదిగిన కొరియోగ్రాఫర్లలో శేఖర్ మాస్టర్ ఒకడు. దివంగత రాకేష్ మాస్టర్ దగ్గర…
మనలో చాలామందికి పొద్దున నిద్రలేచిందే టీ లేక కాఫీ ఏదో ఒకటి తాగకపోతే రోజు ప్రారంభమైనట్లు ఉండదు. అయితే చాలాకాలంగా…
అవును.. మీరు చదివింది నిజమే. ఇలాంటి వాళ్లు ఉంటారా? అన్న సందేహం రావొచ్చు. కానీ.. ఇప్పుడు ఇదే పెద్ద ట్రెండ్…
టాలీవుడ్ లో అసలు అపజయమే ఎరుగని దర్శకుల్లో రాజమౌళి తర్వాత చెప్పుకోవాల్సిన పేరు అనిల్ రావిపూడి. కళ్యాణ్ రామ్ పటాస్…