ఎన్నికల సమయంలో తాను ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్
హామీలపై పలువురు ఏవేవో మాట్లాడుతు న్నారని.. తనకు అన్నీ గుర్తున్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు. సూపర్ సిక్స్ హామీలను తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు. దీనికి గాను సంపద సృష్టిస్తామని చెప్పారు. భయ పడాల్సిన అవసరం లేదని.. ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారని.. ఇప్పుడు వాటిని అన్నింటినీ సెట్ రైట్ చేస్తున్నామని చెప్పారు.
నిజానికి తనకు నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయిన అనుభవం ఉందని.. దీంతో ఒకటి రెండు మాసాల్లో వ్యవస్థలను సరిదిద్దవచ్చని అనుకున్నానని.. కానీ, ఆరు మాసాలైనా ఇప్పటికీ సెట్ రైట్ కాలేక పోతున్నామని వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి తెచ్చిన సొమ్ములు.. అప్పులు చేసిన సొమ్ములు కూడా.. ఎటు మళ్లించారో కూడా తెలియనంతగా ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించారని విమర్శించారు. ఇప్పటికే 75 కేంద్ర పథకాలను దారిలో పెట్టామని చంద్రబాబు చెప్పారు.
వచ్చే సంక్రాంతి నాటికి అన్ని గ్రామాల్లోనూ రహదారులు నిర్మిస్తున్నట్టు తెలిపారు. రైతులకు నష్టం రాకుండా.. ఎప్పటికప్పుడు సొమ్ములు చెల్లిస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే రైతులకు స్మార్ట్ అగ్రి విధానాలపై శిక్షణ ఇప్పించనున్నట్టు చెప్పారు. డ్రోన్లను పరిచయం చేయనున్నట్టు తెలిపారు. వ్యవసాయంలో ఖర్చు తగ్గి రైతులకు ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. దేశంలోనే రైతులు ఎక్కువగా అప్పుల్లో ఉన్నారని.. వారిని ఆదాయం వైపు అడుగులు వేసేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
అమరావతి రాజధానిని పూర్తిగా నిర్మిస్తామని చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే కేంద్రం నుంచి సాయం అందిందన్నారు. మూడు రాజధానులు అన్నారు. మూడు ముక్కలాట ఆడారు. బంగారంలాంటి ఐదేళ్ల సమయాన్ని వృథా చేశారు. ఇప్పుడు అమరావతిని అభివృద్ధి చేస్తున్నాం. అందరికీ ఇళ్లు కట్టిస్తాం. పల్లెల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలాన్ని ఇచ్చి ఇళ్లను కట్టిస్తాం.
అని చంద్రబాబు చెప్పారు. పోలవరం పూర్తి అయితే.. పల్నాడు జిల్లాలోని యలమంద గ్రామానికి కూడా నీరు చేరుతుందన్నారు.
This post was last modified on January 1, 2025 1:34 pm
తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు అజిత్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అటు విజయ్, ఇటు అజిత్…
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…
ఇండియా - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2025 ఛాంపియన్స్…
పూజా హెగ్డే ముంబయి అమ్మాయే అయినా.. ఆమెకు బ్రేక్ వచ్చింది.. ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే అన్న సంగతి తెలిసిందే.…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ…
తొలి సినిమా ‘కహో నా ప్యార్ హై’తో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన హీరో హృతిక్ రోషన్. ఈ సినిమాతో కేవలం…