రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. నిన్నటి వరకు జేజేలు కొట్టి.. జ్యోతులు పట్టిన చేతులే.. నేడు కనుమరుగు కావొచ్చు. నిన్నటి వరకు తిరుగులేదని భావించిన నాయకులే నేడు తెర మరుగు కావొచ్చు.
ఏదైనా.. హవా.. రాజకీయ సందడి ప్రాధాన్యం. అదే సమయంలో నేడు అధికారం- అవకాశం ఈ రెండే నేతల ప్రామాణికాలు. ఇప్పుడు వైసీపీకి ఈ దుర్గతే పట్టింది. కీలకమైన నియోజకవర్గంలో పార్టీ జెండా మోసే నాథుడు కనిపించడం లేదు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఇంటికి కూత వేటు దూరంలో ఉన్న నియోజకవర్గం మంగళగిరి. నిజానికి ఈ కార్యాలయం, ఇల్లు కూడా.. ఆ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి.
అయితే.. నియోజకవర్గ కేంద్రం మాత్రం రెండు కిలో మీటర్లలోపు ఉంటుంది. అలాంటి చోట.. ఇప్పుడు వైసీపీ లేకుండా పోతోంది. ఉన్నవారు తుమ్మితే ఊడే ముక్కులా మారిపోయారు. తాజాగా చేనేత వర్గానికి చెందిన బలమైన నాయకుడు గంజి చిరంజీవి వైసీపీకి జల్ల కొట్టి జెండా మార్చేశారు.
ఇక, ఈ ఏడాది ఎన్నికల్లో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయిన.. మురుగుడు లావణ్య ఓటమి తర్వాత.. అజా లేకుండా పోయారు. ఇక, పార్టీలోనే ఉన్న ఈమె మామగారు.. మురుగుడు హనుమంతరావు.. టీడీపీ వైపు చూస్తున్నారు. దీంతో ఈ కుటుంబం దాదాపు వైసీపీకి దూరమైపోయిందన్న ప్రచారం జరుగుతోంది.
ఇక, మాజీ ఎమ్మెల్యే.. టీడీపీ నేతలు.. ముద్దుగా కమల్ హాసన్ అని పిలుచుకునే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా దూరంగానే ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. దాదాపు ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఫలితంగా ఉన్న ఒక్కరు గంజి చిరంజీవి. ఈయనకే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని జగన్ భావించారు. కానీ, ఆయన కూడా ఇప్పుడు ఫిరాయించేశారు. దీంతో ఇప్పుడు వైసీపీ జెండా పట్టుకునేవాడు.. కట్టుకునే వాడు కూడా లేకుండా పోయారు.
మరోవైపు.. మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ హవా రోజురోజుకు పెరుగుతోంది. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గంలో 75 వేల మంది టీడీపీలో చేరారు. ఈ సభ్యత్వ కార్యక్రమం మరింత ముమ్మరంగా సాగుతోంది. దీంతో మున్ముందు.. వైసీపీకి కార్యకర్తలు కూడా కరువయ్యే పరిస్థితి ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on December 31, 2024 7:19 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…