“ఈ ఒక్క ఎన్నికల్లో చంద్రబాబును అడ్డుకుంటే చాలు. ఇక, 30 ఏళ్లపాటు మనకు తిరుగు ఉండదు” – అని వైసీపీ అధినేత జగన్ ప్రకటన చేసినప్పుడు.. సహజంగానే టీడీపీలో ఒక విధమైన నిర్వేదం పెల్లుబికింది. అప్పటికి ఏ పార్టీతోనూ పొత్తు లేదు. పైగా.. తమ్ముళ్లపై కేసులు పెట్టారు. అరెస్టులు చేశారు. కొందరు నాయకులు వీటికి భయపడి బయటకు కూడా రాలేని పరిస్తితి ఏర్పడింది. మరో ఆరేడు మాసాల్లోనే ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో.. ఏ పార్టీ అయినా.. డీలా పడుతుంది. భవిష్యత్తుపై బెంగ పెట్టుకుంటుంది.
కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు మరింత రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగారు. తాను అరెస్టయి జైల్లో ఉన్నా.. తనదైన శైలిలో అక్కడి నుంచే మంత్రాంగం నడిపించారు. ఇదేసమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చూపిన చొరవ కూడా.. టీడీపీకి ప్రాణం పోసింది. ఆ తర్వాత.. ఇక ఎక్కడా వెనుది రిగి చూసుకోలేదు. ఎన్నికల సమయంలో కలిసి వచ్చిన ఎన్నారైలు, మీడియా, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. సీబీఎన్ ఆర్మీ.. ఇలా.. అన్ని వేళ్లు కలిసి ‘చెయ్యి’ అయినట్టుగా అందరూ కలిసి చంద్రబాబును సీఎం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగిన వ్యవహారం నభూతో అనే చెప్పాలి.
ఇలా.. 2024 తొలి అర్ధభాగం టీడీపీనే కాదు.. చంద్రబాబు కూడా.. మైలురాయిగా నిలిచింది. మరోవైపు కేంద్రంతోనూ చెలిమి ఈ సంవత్సరం మరింత బలోపేతం అయింది. మోడీ సర్కారుకు సరైన మెజారిటీ రాకపోవడంతోపాటు.. మిత్రపక్షాలలో అత్యంత నమ్మదగిన నాయకుడిగా చంద్రబాబు ముద్రవేసుకున్నా రు. కేంద్రంలో చెలిమి ఉందని గొంతెమ్మ కోరికలు లేకుండా.. కేంద్రాన్ని మెప్పించేలా ఆయన చేసిన రాజకీయం.. మోడీ మనసులో బలంగా నాటుకుంది. ఫలితంగా.. జాతీయస్థాయిలోనూ మళ్లీ 1990ల నాటి ప్రభ చంద్రబాబుకు తిరిగి వచ్చింది.
ఇక, పార్టీపరంగా చూసుకున్నా.. 134 మంది అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా తెలుగు దేశం పార్టీ తొలిసారి ఒక సరికొత్త రికార్డును సృష్టించింది. పాలన పరంగా.. ఈ ఏడాది జూన్ 12న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. డీఎస్సీపై తొలి సంతకం నుంచి అమరావతి రాజధాని నిర్మాణ పనుల వరకు, పింఛన్ల పెంపు నుంచి వంట గ్యాస్ హామీ వరకు.. అవకాశం ఉన్న ప్రతి విషయంలోనూ చంద్రబాబు ప్రజలకు చేరువయ్యారు. ఇక, వైసీపీ చేసిన వ్యవస్థల నిర్వీర్యం కూడా.. ఆయనకు సవాల్‌గా మారింది.
అసెంబ్లీ వేదికగా.. శ్వేత పత్రాలు విడుదల చేయడం.. వైసీపీ చేసిన దమన కాండను వివరించడం ద్వారా రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉన్నదో కూడా చెప్పుకొచ్చారు. ఏదేమైనా.. 2024 తొలి అర్ధభాగంలో పార్టీని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడంలో సక్సెస్ అయిన చంద్రబాబు రెండో అర్ధభాగంలో విజనరీ నాయకుడిగా మరోసారి తనను తాను నిరూపించుకుని.. ఈ సంవత్సరం ఒక మైలు రాయిగా నిలిచేలా చేసుకున్నారని చెప్పుకోవచ్చు.
This post was last modified on December 31, 2024 1:33 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…