ఏపీలో మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణాలు అందుబాటులోకి రానున్నాయి. అయితే.. దీనికి తాజాగా సీఎం చంద్ర బాబు ప్రాథమిక ముహూర్తం పెట్టారు. వచ్చే ఏడాది ఉగాది(ఏప్రిల్) నాటికి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించే దిశగా అడుగులు వడివడిగా వేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాదరెడ్డి, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు సహా.. సంబంధిత అధికారులతో ఆయన సుదీర్ఘంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా వారికి లక్ష్యాలు నిర్దేశించారు. సాధ్యమైనంత వరకు ఉగాది సందర్భంగా ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని మహిళలకు అందుబాటులోకి తీసుకురావాలని తాను నిర్ణయించుకున్నట్టు తెలిపారు. కొత్త తెలుగు సంవత్సరాది సందర్భంగా మహిళలకు ఈ అవకాశం కల్పిస్తే.. వారు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారని చెప్పారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అదేసమయంలో ప్రస్తుతం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సేవలు అందుతున్న తెలంగాణ, ఢిల్లీ, కర్ణాటకల్లో అధికారులు అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఈ నివేదికలను నెల రోజుల్లో అందించేలా చూడాలని మంత్రిని ఆదేశించారు.
ఏయే సర్వీసులను మహిళలకు కేటాయించాలి? తద్వారా జరిగే పరిణామాలు.. ఆటో, క్యాబ్ డ్రైవర్ల ఉపాధిపై పడే ప్రభావం వంటి వాటిని కూలంకషంగా అధ్యయనం చేయాలన్నారు. ఇదేసమయంలో ఆయా రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయంగా ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఏం చేస్తున్నారో కూడా వివరించాలని సూచించారు. రాష్ట్రంలో అదనపు బస్సులు ఏ సంఖ్యలో అవసరం అవుతాయో కూడా తెలపాలని సూచించారు. ప్రతి విషయాన్నీ చాలా నిశితంగా అధ్యయనం చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో అవసరమైతే భేటీ అయ్యేలా అప్పాయింట్‌మెంట్లు తీసుకోవాలని తెలిపారు.
కీలక హామీ..
ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పక్షాన ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ హామీల్లో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సేవలు కీలకంగా మారాయి. ఈ పథకాన్ని ఎప్పుడెప్పుడు అమలు చేస్తారా? అని రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎదురు చూస్తున్నారు. దీనిపై ఇటీవలే ఒక సమాచారం వెలుగు చూసింది. జనవరి 2025 నుంచే ఈ పథకాన్ని పట్టాలెక్కించనున్నారని వార్తలు హల్చల్ చేశాయి. కానీ, తాజాగా సీఎం చంద్రబాబు ఈ గడువును ఉగాదిగా(ప్రాథమికంగా) నిర్ణయించారు. అవసరమైతే.. మరింత గడువు తీసుకునే అవకాశం ఉంది. అయితే.. ఎట్టి పరిస్థితిలోనూ 2025లో మాత్రం ఈ పథకం మహిళలకు చేరువ కానుంది.
This post was last modified on December 30, 2024 8:53 pm
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…
‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…
ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…