అర్థం కాని ఫజిల్ లా వ్యవహరించటం గులాబీ బాస్ కేసీఆర్ కు కొత్తేం కాదు. అందరు ఏం చేస్తారో.. అది మాత్రం చేయని తత్త్వం ఆయన సొంతం. అవసరానికి అనుకూలంగా వ్యవహరించిన వారి విషయంలో ఆయన ఒక్కోసారి ప్రదర్శించే తీరు సామాన్యుడికే కాదు.. కరడుగట్టిన రాజకీయ నేతలకు సైతం విస్మయానికి గురి చేస్తుంది.
జబ్బు చేస్తే సూది మందు వేసుకోవటానికి ఇష్టపడని కేసీఆర్.. తన కోసం.. తన వాదాన్ని నిజం చేసేందుకు కష్టపడిన వారిని.. చేయి కలిపిన వారి విషయంలో ఆయన ఎంత దూరంగా ఉంటారో చూసినప్పుడు ఆయన్ను అమితంగా అభిమానించే వారికి సైతం ఆగ్రహానికి గురి చేసేలా చేస్తుంది.
పోయిన ప్రాణం తిరిగి రాకపోవచ్చు. కానీ.. ఉన్న కాలంలో మన పట్ల సదరు వ్యక్తి ఎలా వ్యవహరించారన్న విషయాన్ని తలుచుకొని.. తమకున్న సంబంధాన్ని..అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన వారి దగ్గర నిలబడి.. నాలుగు స్మ్రతుల్ని యాది చేసుకుంటే ఏమవుతుంది? అన్నదే ప్రశ్న.
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విషయాన్నే తీసుకోండి. ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చెప్పినట్లే చేసి ఉండొచ్చు. విమర్శకులు ఆయన్ను సోనియా రిమోట్ గా అభివర్ణించి ఉండొచ్చు.
అంతమాత్రానికే ఆయన్ను వెన్నుముక లేని ప్రధానిగా గుర్తు పెట్టుకోగలమా? చరిత్ర ఆయన్ను అలా అనుకుంటుందా? అంటే లేదనే చెప్పాలి. తనకున్న పరిమితుల్లోనూ.. దేశ ఆర్థిక వ్యవస్థకు తాను చేయాల్సిందంతా చేశారు. తన అభిప్రాయాలను కొన్నిసార్లు గౌరవించకున్నప్పటికీ.. ఆ సందర్భాల్లో మౌనంగా ఉన్నారు. కానీ.. దేశ హితం కోసం తన ప్యత్నాల్ని ఎప్పుడూ ఆపింది లేదు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో సోనియా గాంధీ డిసైడ్ అయిన తర్వాత ఆపేవారెవరూ అప్పట్లో లేకపోవచ్చు. కానీ.. ఆమె ఆలోచనలకు అప్పట్లో ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ కు నచ్చనకున్నా.. దేశానికి హితం కాదని భావించినా.. తెలంగాణ ఏర్పాటు కల సాకారం అయ్యేది కాదు.
ఎవరు అవునన్నా.. కాదన్నా.. తెలంగాణ ఏర్పాటులో మన్మోహన్ పాత్రను తక్కువ చేయలేం. తగ్గించి చూడలేం. అలా అని క్రెడిట్ మొత్తం ఆయన ఖాతాలో వేయలేం కానీ.. అడ్డు పడకుండా ఉండటం.. అడ్డు పుల్లలు వేయకుండా ఉండే తీరును మాత్రం మర్చిపోకూడదు. అలాంటి వ్యక్తి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన వేళ.. తెలంగాణ చాంపియన్ గా.. తెలంగాణకు బాపుగా భావించే కేసీఆర్.. తన కలను సాకారం చేయటంలో కీలక భూమిక పోషించిన మన్మోహన్ ను కడసారి చూసి వస్తే ఏమవుతుంది?
నిజమే.. ఇప్పుడు ఆయన దగ్గర అధికారం లేకపోవచ్చు. తాను మాట ఇచ్చి.. తప్పిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు ఎదురుపడాల్సి రావొచ్చు. వారి కుటుంబాన్ని పలుకరించాల్సి రావొచ్చు. అంత మాత్రానికే.. తనకున్న వ్యక్తిగత సంబంధాన్ని.. తన జీవితకాలంలో తీరదనుకున్న స్వప్నాన్ని సాకారం చేసిన వ్యక్తుల్లో ఒకరైన మన్మోహన్ సింగ్ ను కడసారి చూడటం.. అంజలి ఘటించటం.. ఆయనతో తనకున్న గురుతుల్ని యాది చేసుకోవటం లాంటివి చేస్తున్నానన్న విషయాన్ని అందరికి తెలిసేలా చేయటం కోసం ఢిల్లీకి వెళితే ఏమవుతుంది? తన గైర్హాజరీతో తన తీరును తక్కువగా చేసి మాట్లాడే ఛాన్సును గులాబీ బాస్ ఇచ్చారనటంలో ఎలాంటి సందేహం లేదు. చరిత్రలో నిలిచిపోవాలని తపించే వారు.. చరిత్రలో తాము ఎలా నిలుస్తామన్న విషయాన్ని పట్టించుకోవాలి కదా?
This post was last modified on December 30, 2024 3:23 pm
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం పుంజుకుంటోంది. ప్రధానంగా ఐటీ సంస్థల నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు కూడా ఏఐ ఆధారిత…
ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 ది థర్డ్ కేస్ పూర్తి చేసే పనిలో ఉన్న న్యాచురల్ స్టార్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు సొంత బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు లో తాజాగా…
గత ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ జోడీ. పాన్ ఇండియా స్థాయిలో పెద్ద…
మాటల మాంత్రికుడు.. సోషల్ మీడియాలో దుమ్మురేపి.. ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా శాసన మండలిలో ఉన్న తీన్మార్ మల్లన్న తన వాయిస్ ద్వారా…