ఏపీ సీఎం చంద్రబాబు సాంకేతికతకు పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే రైతులకు సంబంధించిన అనేక విషయాల్లో డ్రోన్లను వినియోగిస్తున్నారు. అదేవిధంగా ఐటీ రంగంలో ఏఐని ప్రోత్సహించనున్నారు. త్వరలోనే ఏఐ యూని వర్సిటీని కూడా విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్నారు. ఇలా.. ప్రతి రంగంలోనూ సాంకేతిక పరిమణాలు వెదజల్లేలా చేస్తు న్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వైద్య సేవల్లోనూ ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ను ప్రవేశ పెట్టాలని నిర్ణయించా రు. దీనికి ఎంత వ్యయమైనా ఫర్వాలేదన్నారు.
ఏం చేస్తారు?
సీఎం చంద్రబాబు సూచనల ప్రకారం.. వైద్య రంగంలో ఏఐ ద్వారా.. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షలను ఏఐ ద్వారా నిశితంగా పరిశీలిస్తారు. తద్వారా.. బయట పడని రోగాలను వెంటనే గుర్తించనున్నారు. ముఖ్యంగా కిడ్నీ, బోదకాలు, క్షయ, పెరాలిసిస్(పక్షవాతం) వంటివాటిని ముందుగానే గుర్తిస్తారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోగాలు ఎక్కువ గా ఉన్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు.. దీనివల్ల ప్రభుత్వంపైనా భారం పడుతోంది. ఈ క్రమంలో ఏఐ టెక్నాలజీని వినియోగించి.. ముందుగానే ఆయా రోగాలను గుర్తించి.. వాటిని అరికట్టే ప్రయత్నం చేయనున్నారు.
108, 104 కు జవసత్వాలు!
బాధితులకు ఫోన్ కాల్ దూరంలో ఉండే 108, 104 సేవలను మరింత విస్తరించే దిశగా చంద్రబాబు అడుగులు వేశారు. 108 వాహనాలను మరో 190 కొనుగోలు చేయాలని నిర్ణయించారు. దీనికిగాను సుమారు 60 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుంద ని తెలిపారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కీలకమైన 104 సేవలను మరింత బలోపేతం చేయడంతోపాటు.. వాహన డ్రైవర్లు, ఏఎన్ ఎంలకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు. మొత్తంగా రాష్ట్రంలో వైద్య రంగాన్ని వచ్చే రెండేళ్లలోనే కొత్త పుంతలు తొక్కించే దిశగా చంద్రబాబు తాజాగా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అదేవిధంగా ఎన్టీఆర్ బీమా పథకం సేవలను ఒకే కాల్ సెంటర్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు.
This post was last modified on December 28, 2024 9:20 pm
కాంగ్రెస్ పార్టీ మాజీ అద్యక్షురాలు, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ పీకల్లోతు చిక్కుల్లో పడిపోయారని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి అత్యధిక…
టీడీపీ సీనియర్ మోస్ట్ నేత, ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు… నిత్యం వివాదాలతోనే సహవాసం చేస్తున్నట్లుగా ఉంది. యంగ్…
తెలుగు రాష్ట్రాల్లో అటు ఏపీ అసెంబ్లీకి విపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టడం లేదు. ఏదో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాలి…
విభజన హామీల అమలు.. సమస్యల పరిష్కారంపై మరోసారి కేంద్ర ప్రభుత్వం బంతాట ప్రారంభించింది. మీరే తేల్చుకోండి! అని తేల్చి చెప్పింది.…
మంత్రి నారా లోకేష్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ముఖ్యమంత్రి.. ఏపీ విధ్వంసకారి అంటూ వైసీపీ అధినేత జగన్…
అధికార పక్షం ముందు ప్రతిపక్షం బింకంగానే ఉంటుంది. అది కేంద్రమైనా.. రాష్ట్రమైనా.. ఒక్కటే రాజకీయం. మంచి చేసినా.. చెడు చేసినా..…