తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై డీఎంకే ప్రభుత్వ తీరుపై తన వినూత్న నిరసనతో హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటనను నిరసిస్తూ శుక్రవారం ఉదయం తన నివాసం ముందు చొక్కా విప్పి, కొరడాతో ఆరు సార్లు స్వయంగా కొట్టుకున్న ఆయన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గురువారం జరిగిన మీడియా సమావేశంలో అన్నామలై డీఎంకే ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో మహిళలు, యువతకు భద్రత లేదని, విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తి డీఎంకేకు చెందినవాడే అని ఆరోపించారు. తన పోరాటంలో డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు చెప్పులు కూడా వేయనని శపథం చేశారు. ఆయన ఈ నిరసనతో 48 రోజుల నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు.
శుక్రవారం ఉదయం తన ఇంటి ముందు అన్నామలై చెప్పినట్లుగానే కొరడా దెబ్బలు కొట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఆయన చర్య ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. విద్యార్థినిపై జరిగిన ఘటనకు సమాధానం చెప్పడంలో డీఎంకే ప్రభుత్వం విఫలమైందని, తక్షణమే నిందితులను శిక్షించాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. అన్నామలై వినూత్న నిరసనతో బీజేపీ కార్యకర్తలు ఆయనకు మద్దతు తెలిపారు. డీఎంకే శ్రేణులు, ప్రతిపక్షాలు ఈ చర్యను వ్యతిరేకించాయి. ఈ పరిస్థితుల్లో అన్నామలై పోరాటం రాజకీయంగా ఏమేరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.
This post was last modified on December 27, 2024 2:39 pm
బాలీవుడ్ డెబ్యూ స్పెషల్ గా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే అదిచ్చే ఫలితాన్ని బట్టే మార్కెట్ తో పాటు అవకాశాలు…
ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ లో నటించాక ఏ హీరోయిన్ కైనా ఆఫర్ల వర్షం కురుస్తుంది. కానీ కెజిఎఫ్ రెండు భాగాల్లో…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు పెద్ద సినిమాలు సెట్స్ మీదుంచి వాటిని బ్యాలన్స్ చేయడం ఎంతటి అగ్ర నిర్మాతలకైనా సరే…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గాలి భానుప్రకాష్ నాయుడు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…