ఏపీలో వైసీపీ నాయకులను కూటమి పార్టీలు చేర్చుకుంటున్న విషయం తెలిసిందే. అయితే..ఇప్పటి వరకు కూటమిలోని టీడీపీ, జనసేన మధ్యే ఈ తరహా రాజకీయాలు సాగుతున్నాయి. ఈ రెండు పార్టీల అధినేతలు.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు.. ఆలోచించి.. తమకు అనుకూలంగా ఉన్న వైసీపీ నాయకులను చెరో పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఈ క్రమంలో వారి గ్రాఫ్‌ను పరిశీలిస్తున్నారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య వివాదాలకు అవకాశం లేకుండా.. జంపింగులు జరుగుతున్నాయి.
అయితే.. మేం మాత్రం తక్కువగా అంటూ.. బీజేపీ కూడా ఇప్పుడు రంగంలోకి దిగింది. వైసీపీ నుంచి వచ్చే వారికి రెడ్ కార్పెట్ పరుస్తూ.. వచ్చిన వారిని వచ్చినట్టు చేర్చుకునేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో తాజాగా విశాఖపట్నానికి చెందిన విశాఖ డెయిరీ చైర్మన్, వైసీపీ నాయకుడు ఆడారి ఆనంద్‌కుమార్‌ను బీజేపీలోకి చేర్చుకున్నారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందేశ్వరి ఆయనకు కండువా కప్పి.. కమల తీర్థం ఇచ్చారు. ఇక నుంచి ఆడారి.. తమ నాయకుడేనని ప్రకటించారు.
ఇదే ఇప్పుడు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడకు.. బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఉరఫ్ చిన్నమ్మకు మధ్య పొలిటికల్ గ్యాప్ పెరిగేలా చేసింది. అసలు ఆడారిని బీజేపీలోకి ఎలా చేర్చుకుంటారని స్పీకర్ తనయుడు, టీడీపీ యువ నాయకుడు చింతకాయల విజయ్ పాత్రుడు ప్రశ్నించారు. అంతేకాదు.. తన తండ్రిని ఓడించేందుకు నర్సీపట్నంలో కంకణం కట్టుకున్న ఆడారిని బీజేపీలోకి ఎలా ఆహ్వానిస్తారని.. పోనీ.. ఇలా చేసే ముందు తమకు ఒక్క మాటైనా ఎందుకు చెప్పలేదని ఆయన నిలదీశారు.
ఇక్కడితోకూడా విజయ్ ఆగలేదు. తమకు కూడా.. వైసీపీ నాయకులను ఆహ్వానించడం తెలుసునని.. రాజమండ్రి పార్లమెంటు స్థానంలో పురందేశ్వరిని ఓడించేందుకు ప్రయత్నించిన కీలక నాయకులను తాము కూడా.. ఆహ్వానించి టీడీపీలోకి చేర్చుకుంటే అప్పుడు తమ బాధేమిటో మేడం పురందేశ్వరికి తెలుస్తుందని ఘాటుగానే చెప్పుకొచ్చారు. తాము సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నామని.. ఒక పార్టీని వదిలి మరోపార్టీలోకి జంప్ చేసే సంస్కృతి మాకు లేదని పరోక్షంగా చిన్నమ్మపై విమర్శలు గుప్పించారు. కూటమిలో ఉన్నప్పుడు.. కనీసం సమాచారం ఇచ్చే సంస్కృతిని పాటిస్తే బాగుండేదన్నారు. మరి ఈ వ్యవహారంపై చిన్నమ్మ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on December 27, 2024 12:06 am
తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు అజిత్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అటు విజయ్, ఇటు అజిత్…
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…
ఇండియా - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2025 ఛాంపియన్స్…
పూజా హెగ్డే ముంబయి అమ్మాయే అయినా.. ఆమెకు బ్రేక్ వచ్చింది.. ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే అన్న సంగతి తెలిసిందే.…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ…
తొలి సినిమా ‘కహో నా ప్యార్ హై’తో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన హీరో హృతిక్ రోషన్. ఈ సినిమాతో కేవలం…