రాజకీయ నాయకులకు సన్మానాలు, సత్కారాలు కామన్. అభిమానులు..కార్యకర్తలు తమ నేతను కలిసినపుడు మర్యాదపూర్వకంగా శాలువాలు కప్పుతుంటారు. తమకు గౌరవార్థం ఇచ్చారు కాబట్టి ఈ శాలువాలను వేరే వారికి ఇవ్వాలన్న ఆలోచన రాదు. దీంతో, ఆ శాలువాలలో చాలా బీరువాలలో నిరుపయోగంగా పడుంటాయి. ఇటువంటి నేపథ్యంలోనే ఆ శాలువాలతో చిన్న పిల్లలకు డ్రెస్సులు కుట్టించే వినూత్న ఆలోచనకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శ్రీకారం చుట్టారు.
అప్పుడపుడు వివాదాలలో పేరు వినిపించినప్పటికీ తన నియోజకవర్గంలోని అనేక సామాజిక కార్యక్రమాల్లో చింతమనేని స్వయంగా పాల్గొని ప్రజలతో మమేకమవుతుంటారన్న పేరుంది. ఈ క్రమంలోనే తనకు వచ్చిన శాలువాలతో చిన్న పిల్లలకు డ్రెస్ లు కుట్టించాలన్న వినూత్న కార్యక్రమాన్ని చింతమనేని చేపట్టారు. తనను కలిసేందుకు వచ్చిన నేతలు, కార్యకర్తలు, వ్యాపారవేత్తలు ఇచ్చిన ఖరీదైన శాలువాలతో వివిధ సైజులలో చిన్నారులకు గౌన్లు, డ్రెస్ లు కుట్టించారు చింతమనేని.
అలా కుట్టించి వదిలేయకుండా ప్రతివారం స్థానికంగా ఉండే, హాస్టళ్లు, అనాధాశ్రమాలలోని విద్యార్థులకు, చిన్నారులకు స్వయంగా చింతమనేని పంచిపెట్టారు. ఈ 6 నెలల కాలంలో తనకు వచ్చిన శాలువాలతో దాదాపు 250 మంది పిల్లలకు బట్టలు కుట్టించగలిగామని, ప్రతి రాజకీయ నాయకుడు ఈ పద్ధతి ఫాలో అయితే బాగుంటుందని అన్నారు. చింతమనేని చేస్తున్న మంచిపనిపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.
This post was last modified on December 24, 2024 3:02 pm
సంక్రాంతి దసరా తర్వాత తెలుగులో సినిమాలకు మంచి డిమాండ్ ఉన్న సీజన్ అంటే.. క్రిస్మసే. క్రిస్మస్ సెలవుల్లో వచ్చే రెండు…
వచ్చే ఏడాది ఏప్రిల్ 10 విడుదల తేదీని ఎప్పుడో లాక్ చేసుకున్న ది రాజా సాబ్ వాయిదా పడుతుందనే వార్తలు…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు శ్రీ తేజ్ ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో…
అంతర్జాతీయగా మోస్ట్ పాపులర్, సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ల్లో.. ‘స్క్విడ్ గేమ్’ ఒకటి. ఈ కొరియన్ వెబ్ సిరీస్ మూడేళ్ల…
‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ నినాదంతో పార్లమెంటులో జమిలి బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2027లో సార్వత్రిక ఎన్నికలు,…
ఆంధ్రప్రదేశ్ను ఐదేళ్ల పాటు పాలించిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నేతల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు. వైసీపీ…