సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారం నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం రాజకీయ రంగు పులుముకున్న సంగతి తెలిసిందే. ఈ ఇష్యూపై డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి జాతీయ మీడియాతో పాటు తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ప్రతీకార పాలనకు రేవంత్ రెడ్డి తెరలేపారని, హామీలు, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే అల్లు అర్జున్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు.
ప్రతిపక్షాలను టార్గెట్ చేయడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. పేదల కోసం కాదని కొందరు పెద్దల కోసం రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని చురకలంటించారు. గురుకులాల్లో చనిపోయిన విద్యార్థులు రేవంత్ కు గుర్తు లేరా అని ప్రశ్నించారు. ఆ విద్యార్థులకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయ కక్షలతో కేసులు పెట్టడం సరికాదని, ఉమ్మడి ఏపీ పాలకుల కంటే ఎక్కువ నిర్బంధం రేవంత్ రెడ్డి పాలనలో కనిపిస్తోందని విమర్శించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ కాదు…బీజేపీ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ కలిసే పనిచేస్తున్నాయని, కాంగ్రెస్ సర్కార్ ను బీజేపీ నడిపిస్తోందని విమర్శించారు. కేటీఆర్‌పై కేసు ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తోందని చెప్పారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలను రేవంత్ కలిసిన తర్వాతే కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదైందని అన్నారు. ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలని బీజేపీ, కాంగ్రెస్ కుట్ర పన్నుతున్నాయని అన్నారు.
తెలంగాణలో 10 శాతం కమీషన్ ప్రభుత్వం నడుస్తోందని, తెలంగాణను ప్రపంచ బ్యాంకుకు ఈ ప్రభుత్వం తాకట్టు పెడుతోందని ఆరోపించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు ప్రజలకు చేరడం లేదని ఆరోపించారు.
This post was last modified on December 24, 2024 9:17 am
అల్లు అర్జున్ను చిక్కడ పల్లి పోలీసులు విచారిస్తున్నారు. అయితే.. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం.. ఆయనను రెండు విడతలుగా మంగళవారమే విచారించనున్నట్టు…
ఏపీ సీఎం చంద్రబాబు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కేబినెట్ మంత్రులకు పక్కా నిబంధన అమలు చేయాలని నిర్ణయించారు.…
నిన్న డాకు మహారాజ్ ప్రెస్ మీట్ లో నిర్మాత నాగవంశీ మేం దిల్ రాజు కోసం వెయిట్ చేస్తున్నామని, ముందు…
కొన్ని సరదాగా వినడానికి కూడా మనం ఇష్టపడం. ఎందుకంటే అవి నిజమైతే కలిగే భయం ఎక్కువ కాబట్టి. నిజ జీవితమైనా…
రాజధాని అమరావతి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నిధుల సమీకరణకు కూడా..…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాత పాటే పాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆర్థిక సమస్యలు చూస్తే.. తన కడుపు…