సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మీడియాలో ఇదే అతి పెద్ద చర్చనీయాంశం. ఈ వ్యవహారంపై నేషనల్ మీడియాలో సైతం చర్చ జరుగుతోంది. గత రెండు రోజుల పరిణామాలతో ఈ గొడవ ఇంకా పెద్దది అయిపోయింది. మొన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ సందర్భంగా.. తనపై వస్తున్న ఆరోపణలన్నింటినీ తిప్పికొట్టడం, పోలీసులు చేసిన వ్యాఖ్యలను ఖండించడం జరిగింది.
మళ్ళీ ఆదివారం హైదరాబాద్ సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరగడం తెలిసిందే. అందులో తప్పంతా బన్నీదే అన్నట్లుగా పోలీసులు మాట్లాడారు. ఐతే ఈ ప్రెస్ మీట్ అనంతరం నేషనల్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సీపీ సీవీ ఆనంద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. పోలీసులను ఇబ్బంది పెట్టేలా వారు ప్రశ్నలు అడగ్గా.. నేషనల్ మీడియా అమ్ముడుబోయిందని, అందుకే బన్నీకి అనుకూలంగా వార్తలు ప్రసారం చేస్తున్నారని కమిషనర్ వ్యాఖ్యానించారు.
దీని మీద నేషనల్ మీడియా భగ్గుమంది. ఈ కేసులో పోలీసుల తీరును తప్పుబడుతూ చర్చలు నడిపింది. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి.. ఆధారాలు లేకుండా మీడియా మీద అభాండాలు వేస్తారా అంటూ జాతీయ ఛానెళ్లలో సీపీకి వ్యతిరేకంగా కథనాలు మొదలయ్యాయి. దీని మీద వివాదం రాజుకున్న నేపథ్యంలో సీవీ ఆనంద్ క్షమాపణలు చెప్పారు. ‘‘ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. ప్రెస్ మీట్లో రెచ్చగొట్టే ప్రశ్నలు వేయడంతో నేను కొంచెం సహనం కోల్పోయాను. పరిస్థితులు ఎలా ఉన్నా సరే.. నేను సంయమనం పాటించాల్సింది.
నేను చేసింది పొరపాటుగా భావిస్తున్నా. నేషనల్ మీడియాపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా’’ అని ఎక్స్‌లో సీవీ ఆనంద్ ఒక పోస్ట్ పెట్టారు. మరోవైపు ఈ ప్రెస్ మీట్ జరగడానికి ముందు విష్ణు మూర్తి అనే సస్పెండెడ్ ఏసీపీ నిర్వహించిన విలేకరుల సమావేశం పెద్ద దుమారమే రేపింది. అనుమతి లేకుండా ప్రెస్ మీట్ పెట్టి.. తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయనపై పోలీసు విభాగం క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైంది.
This post was last modified on December 23, 2024 2:49 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…