ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..’టెక్నాలజీ గురు’ అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన చరిత్రగానే నిలిచింది. పాలనలోనూ.. ప్రజలకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాల్లోనూ ఆయన టెక్నాలజీకే పెద్దపీట వేశారు. వేస్తున్నారు. గతంలో ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు.. ఐటీని అందరికీ చేరువ చేశారు. ఇక, విభజన తర్వాత ఏపీలోనూ.. సాంకేతికతకు పెద్ద పీట వేస్తూ.. పాలనలో మెరుగులు దిద్దుతున్నారు. పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రజలకు మెరుగైన సేవలను అత్యంత నాణ్యంగా కూడా అందిస్తున్నారు.
తద్వారా.. తక్కువ ఖర్చుతో ప్రజలకు ఎక్కువ మేళ్లు చేస్తున్నారనే చర్చ ఉంది. ఇక, ఇప్పుడు తన వ్యక్తిగత భద్రతకు కూడా.. చంద్రబాబు టెక్నాలజీనే వినియోగిస్తున్నారు. దీనివల్ల నెలకు సుమారు 12 కోట్ల రూపాయల వరకు ఆదా చేస్తున్నారు. సాధారణంగా.. ఏ ముఖ్యమంత్రి, ప్రధానికైనా భద్రత కల్పిస్తారు. ఇది ప్రొటోకాల్ విభాగం చూసుకుంటుంది. ప్రజలు ఎన్నుకున్న నాయకుడే కాకుండా.. రాష్ట్రానికి పెద్ద దిక్కు కూడా సీఎం కాబట్టి భద్రతకు ఇచ్చే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే సుమా రు 600 మందికి పైగా చంద్రబాబుకు భద్రత కల్పిస్తున్నారు.
మూడు షిఫ్టులుగా భద్రతలో వందల మంది సిబ్బంది ఉంటారు. వీరిలో రాష్ట్ర, కేంద్ర బలగాలు సహా.. పలుకేటగిరీలకు చెందిన వారు ఉంటారు. ఫలితంగా ప్రభుత్వానికి భారీ స్థాయిలో ఖర్చు పెరిగింది. అయితే.. వీరిని తనకు కాకుండా.. ప్రజల కోసమే వినియోగిస్తే.. సదరు ఖర్చుకు ప్రతిఫలం దక్కుతుందని భావించిన చంద్రబాబు వినూత్నంగా ఆలోచన చేశారు. ఈ క్రమంలో నే అటానమస్(వాటంతట అవే స్పందించే) డ్రోన్లను తన భద్రతకు వినియోగించుకునేలా నిర్ణయించారు. వీటిని ప్రస్తుతానికి రెండు తెప్పించుకున్నారు. వీటిని ఉండవల్లిలోని నివాసంతో పాటు.. చంద్రబాబు పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడ ఉపయోగిస్తారు.
తద్వారా భౌతికంగా.. ఉన్న భద్రతా అధికారుల సంఖ్య తగ్గిపోయింది 230కి చేరిందని సీఎంవో వర్గాలు తెలిపాయి. ఇక, కాన్వాయ్ ను కూడా తగ్గించారు. నిన్నమొన్నటి వరకు 15 వాహనాలు ఉండగా.. వీటిలో నాలుగు వాహనాలు తగ్గించారు. మొత్తంగా అటు సిబ్బంది.. ఇటు వాహనాల సంఖ్యను తగ్గించి.. కూడా పొదుపు చేశారు. మొత్తంగా సీఎం భద్రతకు అటానమస్ డ్రోన్లను వినియోగించడాన్ని ముమ్మరం చేశారు. ఇలా.. ఒక రాష్ట్ర సీఎం తన భద్రతకు అటానమస్ డ్రోన్లను వినియోగించడం ఇదే తొలిసారి.
ఎలా పనిచేస్తాయి?
This post was last modified on December 23, 2024 10:01 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…