Political News

ఢిల్లీకి చేరిన ‘తెలుగు వారి ఆత్మ‌గౌరవం’

తెలుగు వారి ఆత్మ గౌర‌వ నినాదంతో ఏర్ప‌డిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు స‌హా త‌మిళ‌నాడు క‌ర్ణాట‌క‌లోని తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో లైవ్‌లో ఉన్న విష‌యం తెలిసిందే. ఏపీలో అధికారంలో ఉండ‌గా.. తెలంగాణ‌లో పుంజుకుంటోంది. ఇక‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌లోనూ మంచి స‌భ్య‌త్వం ఉంది. ఇప్పుడు ఈ పార్టీ అడుగులు దేశ రాజ‌ధాని ఢిల్లీ వైపుప‌డుతున్నాయి. పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం ఢిల్లీలోనూ ప్రారంభ‌మైంది. ఇలా.. ద‌క్షిణాదికి చెందిన ఒక ప్రాంతీయ పార్టీ దేశ రాజ‌ధానిలో స‌భ్య‌త్వం చేప‌ట్ట‌డం ఇదే తొలిసారి. ఈ ఘ‌న‌త టీడీపీకే ద‌క్కింది.

ప్ర‌స్తుతం పార్ల‌మెంటు స్థాయిలోనే కాకుండా.. కేంద్ర ప్ర‌భుత్వంలోనూ టీడీపీ కీల‌క కీ రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే. మోడీ ప్ర‌భుత్వం ముచ్చ‌ట‌గా మూడో సారి కేంద్రంలో చ‌క్రం తిప్పేందుకు.. టీడీపీ కీలక‌మేన‌న్న విష‌యం తెలిసిందే. ఎన్డీయే కూట‌మిలో కీల‌క భూమిక కూడా పోషిస్తోంది. ఈ క్ర‌మంలో దేశ‌రాజ‌ధానిలో పార్టీ స‌భ్య‌త్వ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. దీనికి అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది. దాదాపు 500 మంది ఆదివారం ఒక్క‌రోజేపార్టీ స‌భ్య‌త్వం తీసుకున్నారు. వీరికి పార్టీ నాయ‌కులు గుర్తింపు కార్డుతోపాటు.. టీడీపీ కండువాను అందించారు.

టుగెద‌ర్ ప్రోగ్రెస్‌-టుగెద‌ర్ విత్ టీడీపీ.. పేరుతో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో స‌ద‌ర‌న్ ట్రావెల్స్ అధినేత‌, టీడీపీ సీనియ‌ర్ నాయకుడు ఆల‌పాటి కృష్ణ‌మోహ‌న్ ఆధ్వ‌ర్యంలో 500 మందికిపైగానే టీడీపీ స‌భ్య‌త్వం తీసుకున్నారు. ఒక్కొక్క‌రు రూ.100 చెల్లించి పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా ఆల‌పాటి మాట్లాడుతూ.. తెలుగు వారి ఆత్మ‌గౌర‌వ నినాదాన్ని దేశ‌వ్యాప్తంగా వినిపిస్తామ‌న్నారు. ఢిల్లీలో ఉండే తెలుగు వారికి త‌మ పార్టీ అండ‌గా ఉంటుంద‌ని చెప్పారు.

రూ.100 చెల్లించి.. పార్టీ స‌భ్య‌త్వం తీసుకున్న‌వారికి ప్ర‌మాద బీమాతో పాటు.. చికిత్స‌ల‌కు అయ్యే ఖ‌ర్చులు కూడా బీమా రూపం లో అందుతాయ‌ని ఆల‌పాటి వివ‌రించారు. వ‌చ్చే రెండు వారాల పాటు క్యాంపులు ఏర్పాటు చేసి స‌భ్య‌త్వాలు ఇవ్వ‌నున్న‌ట్టు వివ‌రించారు. ఢిల్లీలో ఉండే తెలుగు వారి నుంచి భారీ స్పంద‌న వ‌స్తున్న‌ట్టు వివ‌రించారు.

This post was last modified on December 23, 2024 9:55 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

2 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

4 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

4 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

4 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

5 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

6 hours ago