Political News

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు చేసిన పోలీసులు.. ఇప్పుడు మ‌రిన్ని కేసులు న‌మోదు చేసేందుకురెడీ అవుతున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. అసెంబ్లీలో శ‌నివారం సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్ర‌క‌ట‌న అనంత‌రం.. అనూహ్యంగా హైద‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్‌.. సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న‌కు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ వీడియోను మీడియా ముందు ప్ర‌ద‌ర్శించారు.

అల్లు అర్జున్‌కు అన్నీ స్పాట్‌లోనే తెలుసున‌ని.. తొక్కిస‌లాట జ‌రిగింద‌ని.. రేవ‌తి అనే మ‌హిళ మృతి చెందార‌ని.. ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌ని కూడా తెలిసింద‌న్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న త‌మ మాట వినిపించుకోకుండా.. సినిమా పూర్తిగా వీక్షించిన త‌ర్వాతే ఇంటికి వెళ్తాన‌ని భీష్మించిన‌ట్టు చెప్పారు. డిసెంబ‌రు 4న రాత్రి సంధ్య ధియేట‌ర్ వ‌ద్ద‌ విధుల్లో ఉన్న ఏసీపీ, డీసీపీల‌తో కలిసి ఆనంద్ మీడియా ముందుకు రావ‌డం సంచ‌ల‌నంగా మారింది.

డిసెంబర్ 4న‌ రాత్రి పుష్ప‌-2 ప్రీమియ‌ర్ షో విడుద‌ల సంద‌ర్భంగా సంధ్య థియేటర్ వ‌ద్ద‌ భారీగా అర్జున్‌ ఫ్యాన్స్ తరలివ‌చ్చార‌ని తెలిపారు. దీంతోనే తొక్కిసలాట జరిగిందని, ఆ సమయంలో థియేటర్ మేనేజర్ నిర్లక్ష్యంగా వ్యవహారించింద‌న్నారు. ఈ ఘ‌ట‌న‌లో అర్జున్ స‌హా ధియేట‌ర్ యాజ‌మాన్యం.. పాత్ర కూడా ఉంద‌ని.. దీనికి సంబంధించిన వీడియోనే ప‌క్కాగా ఉంద‌న్నారు. ఇది చూసిన త‌ర్వాత‌.. సామాన్యుల‌కు కూడా అర్జున్ పాత్ర ఏంట‌నేది అర్థ‌మ‌వుతుంద‌న్నారు.

ఏసీపీ మాట్లాడుతూ.. డిసెంబ‌రు 4న ప్రీమియ‌ర్ షో చూసేందుకు అర్జున్ వ‌చ్చార‌ని.. తాము అప్ప‌టికే ఆయ‌న‌ను వ‌ద్ద‌ని వారించామ‌ని.. అయినా.. ఆయ‌న వ‌చ్చార‌న్నారు. అర్జున్‌ను చూసేందుకు ఫ్యాన్స్ ప్రయత్నించడంతో తోపులాట జరిగిందన్నారు. ఈ విష‌యాన్ని అల్లు అర్జున్ మేనేజర్‌ సంతోష్‌కు తాము చెప్పిన‌ట్టు తెలిపారు. అర్జున్‌కు విషయం చెప్పేందుకు ప్రయత్నించగా థియేటర్ యాజమాన్యం, మేనేజర్ అంగీకరించలేదన్నారు.

థియేట‌ర్ యాజ‌మాన్య‌మే ఈ విష‌యాన్ని అర్జున్ కు చెబుతామ‌ని చెప్పింద‌ని ఏసీపీ తెలిపారు. తొక్కిస లాట తర్వాత థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోవాలని అల్లు అర్జున్‌కు ఎంత చెప్పినా వినిపించుకోలేదని, డీసీపీ ఆర్డ‌ర్ ప్ర‌కారం తానే జోక్యం చేసుకుని వెళ్లిపోవాల‌ని ఆదేశించాన‌న్నారు. కానీ ఆయ‌న సినిమా చూసిన తర్వాత వెళ్తానని చెప్పారన్నారు. ఆ తర్వాత 10 నుంచి 15 నిమిషాల సమయం ఇచ్చామన్నారు. చివరకు డీసీపీతో వెళ్లి అల్లు అర్జున్‌ను బయటకు తీసుకువచ్చామని వివ‌రించారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయ‌ని వెల్ల‌డించారు.

This post was last modified on December 23, 2024 9:47 am

Share

Recent Posts

అవును… సోనియా పుస్త‌కం ప్ర‌చురించం!

కాంగ్రెస్‌పార్టీ మాజీ అధ్య‌క్షురాలు, ప్ర‌స్తుత రాజ్య‌స‌భ స‌భ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మక‌థ ..పుస్త‌కం ముద్రణ వ్య‌వ‌హారం వివాదంగా మారింది.…

30 minutes ago

సెప్టెంబర్ బోణీ వారం… పోటీ రసవత్తరం

ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…

32 minutes ago

మీ ఫిజిక‌ల్ హెల్ప్ వ‌ద్దు… డ‌బ్బుంటే ఇవ్వండి!

ఆక‌స్మిక ప్ర‌చండ వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుత‌ల‌మైన నేపాల్ తాజాగా ప్ర‌పంచ దేశాల‌ను ఉద్దేశించి కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ``భౌతికంగా మీరు మాకు…

46 minutes ago

‘ఇరుముడి’లో చరణ్… రూమర్‌ను నిజం చేద్దామని

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్‌లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…

1 hour ago

కన్నడిగుల ఆక్రోశం అర్థరహితం

సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…

2 hours ago

బోయపాటికి ఎస్ చెప్పే హీరో ఎవరు

అఖండ 2 తాండవం వచ్చి తొమ్మిది నెలలు అయిపోయాయి. సీక్వెల్ అందులోనూ బ్లాక్ బస్టర్ కొనసాగింపు కాబట్టి బాలయ్య మరోసారి…

3 hours ago