Political News

నారా కుటుంబం ప్ర‌జ‌ల సొమ్ము దోచుకోదు: భువ‌నేశ్వ‌రి

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో నాలుగు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం వెళ్లిన‌.. ఆయ న స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి.. ఆదివారం కీల‌క‌మైన శాంతిపురం మండ‌ల ప‌రిధిలోని ప‌లు గ్రామాల్లో ప‌ర్య టించారు. నేటితో ఆమె ప‌ర్య‌ట‌న ముగియ‌నుంది. ఈ క్ర‌మంలో చేల్ద‌గాని ప‌ల్లె గ్రామంలో ఆమె డ్వాక్రా మ హిళా సంఘాల‌తో భేటీ అయ్యారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. ప్ర‌భుత్వం నుంచి వారికి అందుతు న్న రుణ స‌దుపాయాలు, సంక్షేమ ప‌థ‌కాల వివ‌రాలు అడిగారు. మ‌హిళ‌ల ఆర్థిక స్వావ‌లంబ‌న‌కు ప్ర‌భు త్వం కృషి చేస్తుంద‌న్నారు.

అనంత‌రం నారా భువ‌నేశ్వ‌రి మాట్లాడుతూ.. నారా కుటుంబం.. ఐదు ద‌శాబ్దాలుగా రాజ‌కీయాల్లో ఉంద‌ని తెలిపారు. ఏనాడైనా ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డ‌మే త‌ప్ప‌.. ప్ర‌జ‌ల నుంచి ఒక్క‌రూపాయి కూడా నారా కుటుం బం ఆశించ‌లేద‌ని చెప్పారు. కానీ కొన్ని మీడియాలు.. నారా కుటుంబానికి వ్య‌తిరేకంగా క‌థ‌లు రాస్తూ.. ఆవేద‌న‌కు గురి చేస్తున్నాయ‌ని ఆరోపించారు. నారా కుటుంబం చేస్తున్న సేవ‌లు.. ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌ల కు చేరుతున్నాయ‌ని చెప్పారు. త‌మ కుటుంబం ఉన్న‌న్నాళ్లూ ఈ సేవ‌లు కొన‌సాగుతాయ‌ని చెప్పారు.

ఐదేళ్ల వైసీపీ పాల‌న‌లో ప్ర‌జ‌లు న‌ర‌కం అనుభ‌వించార‌ని.. ప్ర‌జ‌లు అనుభ‌వించిన బాధ‌ల‌తో పోలిస్తే.. నారా కుటుంబం అనుభ‌వించిన బాధ‌లు త‌క్కువేన‌ని చెప్పారు. అయినా.. చంద్ర‌బాబును జైలుకు పంపించ‌డం త‌మ కుటుంబంలో పెద్ద ఆవేద‌న‌ను క‌లిగించింద‌న్నారు. అయినా.. ప్ర‌జ‌ల కోసం చంద్ర‌బాబు అలుపెరుగ‌ని విధంగా ప‌నిచేశార‌ని భువ‌నేశ్వ‌రి చెప్పారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌లు కూడా.. త‌మ‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టార‌ని వివ‌రించారు. కుప్పం ప్ర‌జ‌ల రుణం తీర్చుకోలేనిద‌ని చెప్పారు.

ప్రతి మూడు మాసాలకు ఒకసారి కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తానని నారా భువ‌నేశ్వ‌రి తెలిపారు. నారా కుటుంబం అంటే.. పెట్టే చెయ్యే కానీ.. తీసుకునే చెయ్యి కాద‌న్నారు. ఈ విష‌యాలు ప్ర‌జ‌ల‌కు తెలుసున‌ని.. కానీ, కొంద‌రికి తెలియ‌క పోవ‌డం బాధాక‌రంగా ఉంద‌ని భువ‌నేశ్వ‌రి వ్యాఖ్యానించారు. ఏదేమైనా.. కుప్పం ప్ర‌జ‌ల‌కు తాను అండ‌గా ఉంటాన‌ని.. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఏ కష్టం వ‌చ్చినా ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తామ‌ని హామీ ఇచ్చారు.

This post was last modified on December 22, 2024 3:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

22 minutes ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

49 minutes ago

మీకు కావలసినవన్నీ గేమ్ ఛేంజర్ లో ఇరుక్కు : చరణ్!

తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…

52 minutes ago

రివర్స్ గేమ్ ఆడబోతున్న ఉపేంద్ర ?

అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…

3 hours ago

ఆయ‌న సినిమా హీరో అంతే: డీజీపీ

అల్లు అర్జున్‌-పుష్ప‌-2 వివాదంపై తాజాగా తెలంగాణ‌ డీజీపీ జితేంద‌ర్‌ స్పందించారు. ఆయ‌న సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్య‌వ‌హారంపై…

4 hours ago

ఆస్ట్రేలియాలో 4వ ఫైట్.. టీమిండియాకు మరో షాక్!

ప్రతిష్ఠాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు…

4 hours ago