పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట.. ఈ క్రమంలో రేవతి అనే మహిళ మృతి చెందడం.. ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడిన ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున కొందరు నాయకులు చేసిన వ్యాఖ్యలు.. ఆ వెంటనే శనివారం రాత్రి అల్లు అర్జున్ మీడియా ముందుకు రావడం.. వంటి పరిణామాలు.. ఈ ఘటనను మరింత చర్చనీయాంశం చేశారు.
ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి స్పందించారు. అల్లు అర్జున్‌కు బాసటగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. “జరిగిన ఘటనలో అల్లు అర్జున్ తప్పు ఎక్కడుందో నాకు అర్థం కావడం లేదు” అని పురందేశ్వరి వ్యాఖ్యానించారు. ఆదివారం ప్రకాశం జిల్లాలోని ఆమె నివాసంలో మీడియా తో మాట్లాడిన పురందేశ్వరి.. తన సినిమా విడుదల సందర్భంగా.. వీక్షించేందుకు అల్లు అర్జున్ వెళ్లారని.. దీనిలో తప్పు ఏముందని ప్రశ్నించారు.
అంతేకాదు.. అల్లు అర్జున్ ఈ కేసు ఏ11గా ఉన్నారని.. మొదటి 10 మంది నిందితులను వదిలేసి.. ఏ11గా ఉన్న అర్జున్‌ను అరెస్టు చేయడం వెనుక ఏముందో అర్ధం చేసుకోవచ్చని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు ఇలాంటి సున్నితమైన విషయాల్లో నేరుగా స్పందించడంపైనా చర్చ జరగాలని పురందేశ్వరి పేర్కొన్నారు. తొక్కిసలాటను అల్లు ఏమైనా ప్రేరిపించారా? అని ఆమె ప్రశ్నించారు.
“ఒక మహిళగా .. రేవతి మృతిని జీర్ణించుకోలేను. కానీ, ఆ ఘటన తర్వాత.. జరుగుతున్న పరిణామాలు కూడా అంతే బాధగా ఉన్నాయి. ఈ విషయంలో అర్జున్ తప్పేంటి? ఆయనను అంత హడావుడిగా అరెస్టు చేయాల్సి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు” అని పురందేశ్వరి వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ప్రభుత్వాలు ఏవైనా కూడా.. సంయమనం పాటిస్తే.. అందరికీ బాగుంటుందని తేల్చి చెప్పారు.
This post was last modified on December 22, 2024 1:52 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…