‘పుష్ప-2’ బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మహిళ మృతి కేసుకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ విషయంలో విమర్శలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఒక చర్చా వేదికలో దీటుగా సమాధానం చెప్పారు. తాజాగా అసెంబ్లీలో సైతం ఈ అంశం చర్చకు వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం ప్రకటన చేయాలని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ కోరగా.. ముఖ్యమంత్రి కొంచెం సుదీర్ఘంగానే మాట్లాడారు.
ఈ కేసు విషయం పై ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ఏమన్నారంటే..‘‘సంధ్య థియేటర్ ఘటన అసెంబ్లీలో చర్చకు వస్తుందని అనుకోలేదు. సభ్యులు ఈ విషయంపై ప్రస్తావించారు కాబట్టి నేను స్పందించాల్సి వస్తోంది. ఈ వ్యవహారం ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉన్నందు వల్ల పెద్దగా మాట్లాడకూడదు. ఇలా చేస్తే దర్యాప్తు అధికారి ఇబ్బందుల్లో పడతారు. డిసెంబరు 2న చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో సంధ్య థియేటర్ యాజమాన్యం దరఖాస్తు చేసింది. ఈ నెల 4న ‘పుష్ప-2’ సినిమా ప్రదర్శనకు హీరో హీరోయిన్లు, మరికొందరు థియేటర్‌కు వస్తున్నారని, బందోబస్తు కావాలని అడిగారు.
మరుసటి రోజు పోలీసులు థియేటర్‌కు లిఖిత పూర్వక సమాధానం పంపారు. సంధ్య థియేటర్ పరిసరాల్లో రెస్టారెంట్లు, ఇతర థియేటర్లు ఉన్నాయి. సెలబ్రెటీలు వస్తే జనాన్ని అదుపు చేయడం కష్టమవుతుంది. కాబట్టి సెక్యూరిటీ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. హీరో హీరోయిన్లు ఎవరైనా వస్తే థియేటర్‌కు అనుమతి ఇవ్వొద్దని.. దరఖాస్తును తిరస్కరిస్తున్నామని చెప్పారు. అయినా సరే ప్రిమియర్ షోకు అల్లు అర్జున్ వచ్చారు.
నేరుగా థియేటర్‌కు వచ్చి సినిమా చూసి వెళ్లిపోతే ఈ ఘటన జరిగేదో లేదో నాకు తెలియదు. కానీ క్రాస్ రోడ్డు నుంచి కారులో రూప్ టాప్ మీదికి ఎక్కి చేతులు ఊపుతో సంధ్య థియేటర్‌కు చేరుకున్నారు. అప్పుడు హీరోను చూడాలని అభిమానులు థియేటర్ నుంచి తోసుకుంటూ బయటికి వచ్చారు. హీరో కారును లోపలికి పంపించేందుకు గేటు తెరవగా.. వందల మంది అభిమానులు లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు. అప్పుడే తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోయింది.
ఆమె కొడుక్కి బ్రెయిన్ డ్యామేజ్ అయింది. చికిత్స జరుగుతోంది. ఆ సమయంలో పరిస్థితి అదుపు దాటుతోందని, వెళ్లిపోవాలని అల్లు అర్జున్‌కు పోలీసులు చెప్పాలని ప్రయత్నించారు. కానీ అతను మాత్రం సినిమా చూసే వెళ్తానని అన్నట్లు సిటీ కమిషనర్ నాతో చెప్పారు. ఎలాగోలా పోలీసులు బలవంతంగా అతణ్ని అక్కడి నుంచి పంపించాలని చూస్తే.. మరోసారి రూప్ టాప్ ద్వారా చేతులు ఊపుతూ వెళ్లారు. మహిళ చనిపోయింది, ఆమె కొడుు పరిస్థితి విషమంగా ఉందని తెలిసీ అదే పద్ధతి కొనసాగించారు’’ అని ముఖ్యమంత్రి వివరించారు.
This post was last modified on December 21, 2024 4:23 pm
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…
‘అర్జున్ రెడ్డి’ అనే చిన్న సినిమాతో సందీప్ రెడ్డి వంగ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ సినిమా…
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో…