ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేయనున్నారా? అంటే.. సీఎం చంద్రబాబే ఔనని చెబుతున్నారు. తాజాగా ఆయన అధికారుల ను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో తాను మళ్లీ సర్‌ప్రైజ్ విజిట్స్‌కు రానున్నట్టు తేల్చిచెప్పారు. “ఇప్పుడు చెప్పి వచ్చాను. ఇక, నుంచి చెప్పి మాత్రం రాను. రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక పర్యటనలు చేస్తా. అధికారుల పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకుంటా” అని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఈడుపుగల్లులో శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ సదస్సుకు వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను తీసుకున్నారు. ఎక్కువగా వైసీపీ హయాంలో భూముల అక్రమాలకు సంబంధించే ఫిర్యాదులు వస్తున్నట్టు తెలుసుకున్నారు. వీటిని సత్వరం పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అయితే.. కొన్ని న్యాయపరమైన చిక్కుల్లో ఉన్నాయని.. భూబకాసుల మాదిరిగా.. వైసీపీ నాయకులు ఎగబడి మరీ ప్రజల ఆస్తులను దోచుకున్నారని విమర్శించారు.
అయినప్పటికీ.. ప్రజల ఆస్తులను పరిరక్షించే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం తెలిపారు. ప్రతి ఒక్కరి ఆస్తికీ ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందని.. కబ్జాదారుల నుంచి ఆస్తులను వెనక్కి తీసుకుని, వారిని కటకటాల్లోకి నెడతామని తెలిపారు. అనంతరం.. అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇంకా చాలా మంది పనిలో అలసత్వం వహిస్తున్నారని.. తాను ఈ లోపాలను గమనిస్తున్నానని తెలిపారు. ఇప్పటి వరకు అయింది అయిపోయిందని.. కానీ, ఇక నుంచి మాత్రం ఉపేక్షించేది లేదన్నారు.
ఆర్టీజీఎస్ ద్వారా.. తాను అన్నీ తెలుసుకుంటానని చంద్రబాబు చెప్పారు. ప్రస్తుతం చెప్పి వచ్చానన్న ఆయన ఇక నుంచి చెప్పకుండానే పర్యటనలకు వస్తానని.. అప్పుడు అధికారుల తీరును నేరుగా గమనిస్తానని తెలిపారు. పనితీరు మార్చుకోకపోతే పరిణామాలు కూడా తీవ్రంగానే ఉంటాయని చంద్రబాబు హెచ్చరించారు. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. అదేవిధంగా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. “ఇక నుంచి ఉపేక్షించేది లేదు. అందరూ తమ పనితీరును మెరుగు పరుచుకోవాలి” అని చంద్రబాబు తేల్చి చెప్పారు.
This post was last modified on December 20, 2024 10:23 pm
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…
వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…