Political News

చంద్ర‌బాబు.. న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేస్తున్న త‌మ్ముడు!!

టీడీపీ త‌ర‌ఫున తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్న కొలికపూడి శ్రీనివాస్‌కు ప్ర‌త్యేక‌త ఉంది. ఆయ‌నకు విష‌య ప‌రిజ్ఞానం ఎక్కువ‌ని అంటారు. ఏ విష‌యంపైనైనా ఆయ‌న ఆలోచించి.. అధ్య‌య‌నం చేసి.. స్పందిస్తార‌న్న మంచి పేరు కూడా ఉంది. అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంలో ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరు.. అక్క‌డి రైతుల‌కు అండ‌గా ఉన్న తీరు వంటివి ఆయ‌న‌ను హీరోను చేశాయి. ఈ క్ర‌మంలోనే కొలికపూడి చంద్ర‌బాబుకు చేరువ‌య్యారు.

అంతేకాదు.. తాజాగా ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఎంతో మంది పోటీలో ఉన్న‌ప్ప‌టికీ.. చివ‌రి నిముషంలో ర‌గ‌డ జ‌రుగుతుంద‌ని తెలిసిన‌ప్ప‌టికీ.. కొలిక‌పూడికి ప్ర‌త్యేకంగా టికెట్ కేటాయించారు. వాస్త‌వానికి గుంటూ రు జిల్లాకు చెందిన వ్య‌క్తి. 2020 వ‌ర‌కు ఆయ‌నకు రాజ‌కీయాల‌తో సంబంధం లేదు. కేవ‌లం చ‌ర్చ‌లు.. ఇతర‌త్రా కార్య‌క్ర‌మాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యారు. అయితే.. ఆ త‌ర్వాత‌..వ‌చ్చిన అమ‌రావ‌తి ఉద్య‌మం తో దూకుడుగా ఉండి.. చంద్ర‌బాబు కంట్లో ప‌డ్డారు.

విజ్ఞ‌త‌, ఆలోచ‌నాప‌రుడు అనే ముద్ర వేసుకున్న కొలికిపూడిని చంద్ర‌బాబు చాలా గౌర‌వంగా చూశారు. గుంటూరు నుంచి తీసుకువ‌చ్చి ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు నియోజ‌క‌వ‌ర్గంలో అప్ప‌టి మంత్రి కొత్త‌ప‌ల్లి శామ్యూల్ జ‌వ‌హ‌ర్‌ను కూడా త‌ప్పించి.. ఆయ‌న‌కు టికెట్ ఇచ్చారు. ఈ ఎన్నిక‌ల్లో కూట‌మి హ‌వాతో విజయం ద‌క్కించుకున్నారు. కానీ, ఆయ‌న ఎమ్మెల్యే అయిన నాటి నుంచి వివాదాల‌కు కేంద్రంగా మారారు. ర‌హ‌దారుల బాగుజేత కోసం.. ఉద్య‌మం పేరుతో చంద్ర‌బాబుపైనే నిప్పులు చెరిగారు.

త‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేద‌న్న అక్క‌సుతో అధికారుల‌పై చిందులు తొక్కారు. సొంత పార్టీ నాయ‌కుల పైనే దుమ్మెత్తిపోశారు. ఒకానొక ద‌శ‌లో పార్టీ నుంచి స‌స్పెండ్ చేయాల‌న్న డిమాండ్లు త‌మ్ముళ్ల నుంచే వినిపించే ప‌రిస్థితి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో జోక్యం చేసుకున్న చంద్ర‌బాబు రెండు మాసాల కింద‌ట హ‌ద్దులు చెప్పారు. అయితే..కొన్నాళ్లు మౌనంగా ఉన్న కొలిక‌పూడి.. తాజాగా మ‌రోసారి రెచ్చిపోయారు. రోడ్డెక్కారు. ప్ర‌భుత్వానికి సొమ్ములు చెల్లించి.. లైసెన్సు తెచ్చుకుని దుకాణాలు న‌డుపుతున్న మ‌ద్యం షాపుల‌పై హంగామా సృష్టించారు.

బెల్టు షాపుల‌కు మ‌ద్యం అమ్ముతున్నార‌ని, పాఠ‌శాల‌ల‌కు చేరువ‌లో లిక్క‌రు షాపులు ఏర్పాటు చేశార‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేస్తూ.. ఆయా షాపుల‌ను బ‌ల‌వంతంగా మూసివేయించ‌డం.. తీవ్ర వివాదానికి దారి తీసింది. అంతేకాదు.. అధికారుల‌ను కూడా కొలిక‌పూడి బెదిరించే స్థాయికి వ‌చ్చాడ‌ని త‌మ్ముళ్లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈయ‌న‌ను త‌క్ష‌ణ‌మే మంద‌లించాల‌ని వారు కోరుతున్నారు. చంద్ర‌బాబుకు కంట్లో న‌లుసులా మారిన కొలికపూడి వ్య‌వ‌హారంపై ఏం తేలుస్తారోచూడాలి.

This post was last modified on December 18, 2024 11:36 am

Share

Recent Posts

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

1 hour ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

2 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

2 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

3 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

3 hours ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

3 hours ago