టీడీపీలో ఇప్పుడు ఒక పేరు తరచూ వినిపిస్తోంది. ఆ పేరు 2014లో పార్టీ విజయం సాధించినప్పుడూ వినిపించింది.. ఇప్పుడు 2024 ఎన్నికల్లో గెలిచాక కూడా వినిపిస్తోంది. సహజంగానే తెలుగుదేశం ప్రభుత్వం అంటే వినిపించే పేర్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆయన తనయుడు నారా లోకేష్ పేర్లు మాత్రమే.. ఇప్పుడు మూడో పవర్ సెంటర్ కూడా టీడీపీలో వచ్చిందన్న గుసగుసలు పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. ఆ పేరుపై పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు అధికార వర్గాల్లోనూ చర్చ నడుస్తోంది. ఆ పవర్ ఫుల్ వ్యక్తి పేరే కిలారి రాజేష్.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు అందరికి అందుబాటులో ఉండడం కుదరడం లేదు. ఇక అటు లోకేష్ కూడా పార్టీ వ్యవహారాలతో పాటు ప్రభుత్వ వ్యవహారాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే చాలా మంది సీనియర్ నేతలు తమ దగ్గరకు వచ్చిన అంశాలతో పాటు తమకు కావాల్సిన పనుల విషయంలో కిలారు రాజేష్‌ను సంప్రదిస్తుండడంతో పాటు ఆయన దగ్గరకే తీసుకు వెళుతున్నారని భోగట్టా..! గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ కేసులో కిలారు రాజేష్‌ను కూడా సీఐడీ ద్వారా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయగా ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
మంత్రి నారా లోకేష్‌కు కిలారు రాజేష్ ఎంతో సన్నిహితుడిగా పేరుంది. దీంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయన మరింత పవర్ ఫుల్ అయిపోయారు. మంత్రి లోకేష్ సైతం తన దగ్గరకు వచ్చిన పెద్ద పెద్ద డీలింగ్స్, పనులను రాజేష్‌కే అప్పగిస్తున్నారని కూడా అంటున్నారు. మంగళగిరి టీడీపీ ఆఫీస్‌లోని మూడో అంతస్తు నుంచే రాజేష్ పనులు చక్క పెట్టేస్తున్నాడని భోగట్టా.. !
సహజంగానే అధికారంలో ఉన్న వారు మరో పవర్ సెంటర్ వచ్చేందుకు ఎంత మాత్రం ఇష్టపడరు. కానీ ఇక్కడ చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ కూడా కిలారు రాజేష్‌ను ఎంకరేజ్ చేస్తోన్న పరిస్థితి ఉందని టీడీపీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. నారా లోకేష్‌కు చాలా అంటే చాలా సన్నిహితుడు కావడం వల్లే కిలారు రాజేష్ 2014లో తెలుగుదేశం ప్రభుత్వంలో కాని.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కాని ఓ రేంజ్‌లో చక్రం తిప్పుతున్నారని టాక్ ?
This post was last modified on December 18, 2024 12:43 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…