వైసీపీ హయాంలో జగన్ అండ చూసుకొని ఆ పార్టీ మంత్రులు, నేతలు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మాజీ మంత్రి జోగి రమేష్ వంటి నేతలైతే ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించారు. అటువంటి జోగి రమేష్ తాజాగా టీడీపీ నేత, మంత్రి పార్థసారధితో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న వైనం సంచలనం రేపుతోంది. ఈ విషయంపై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది.
నూజివీడులో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. టీడీపీ నేతలు నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి పార్ధసారథి, టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీషలతోపాటు మాజీ మంత్రి జోగి రమేశ్ కూడా హాజరు కావడం హాట్ టాపిక్ గా మారింది. వారితో కలిసి నూజివీడు వీధుల్లో జోగి రమేష్ ర్యాలీగా తిరగడం సంచలనం రేపింది. అధికారికంగా జోగి రమేష్ టీడీపీలో చేరలేదు. అటువంటిది ఈ కార్యక్రమం, ర్యాలీలో పాల్గొనడంపై టీడీపీ నేతలు కొందరు మండిపడుతున్నారు.
గతంలో చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన జోగి రమేష్ పై ఆల్రెడీ గుర్రుగా ఉన్న తెలుగు తమ్ముళ్లు తాజా ఘటనతో ఫైర్ అవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న లోకేష్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారట. ఒకవేళ జోగి రమేష్ టీడీపీలోకి వస్తానని అన్నా…చేర్చుకుంటారో లేదో తెలీదని, అటువంటిది పార్టీలో చేరకుండానే ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఏంటని మండిపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలోనే జోగి రమేష్ ను వైసీపీ అధినేత జగన్ పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశముందని తెలుస్తోంది. తన కుమారుడు అగ్రిగోల్డ్ కేసులో అరెస్టయినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు జోగి రమేష్ దూరంగా ఉంటోన్న సంగతి తెలిసిందే.
This post was last modified on December 16, 2024 3:21 pm
భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ గబ్బా వేదికగా మూడో టెస్టు మ్యాచ్‌లో తలపడుతోన్న విషయం తెలిసిందే. అయితే, ఈ…
‘పుష్ప: ది రూల్’ సినిమా రిలీజై పది రోజులు దాటిపోయింది. ఈ తెలుగు సినిమా తెలుగు రాష్ట్రాల్లో కొంచెం వీక్…
అభిమానులందు మహేష్ బాబు అభిమానులు వేరయా అని కొత్త సామెత రాయలేమో. మహేష్ బాబు ఫ్యాన్స్ తీరు చూస్తుంటే అలాగే…
మొన్నటి ఏడాది ఒకే సమయంలో మూడు నాలుగు షూటింగుల్లో పాల్గొంటూ కనీసం ప్రమోషన్లకు టైం లేనంత బిజీగా ఉన్న శ్రీలీల…
తమిళనాడులోని ప్రసిద్ధ శ్రీవల్లిపుత్తూరు ఆండాళ్ దేవాలయ గర్భగుడిలోకి ఇళయరాజా వెళ్తుండగా అర్చకులు అడ్డుకున్న వీడియో మీద సోషల్ మీడియాలో పెద్ద…
వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి చుట్టూ మరో కేసు ముసురుకుంది. ఆయన కొన్నాళ్ల కిందట…