జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం.. టికెట్ త్యాగం చేసిన ఎన్‌వీఎస్ ఎస్ వర్మకు సొంత నియోజకవర్గం పిఠాపురంలో మరోసారి బ్రేకులు పడ్డాయి. ఆయన అనుచరులకు తీవ్ర పరాభవం జరిగినట్టు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. వచ్చే నెల సంక్రాంతిని పురస్కరించుకుని పిఠాపురం పరిసర ప్రాంతాల్లో కోడి పందేలు వేయడం ఆనవాయితీ. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా.. వర్మ అనుచరులు పెద్ద ఎత్తున బరులు గీసి పందేలు వేశారు.
కానీ, ఇప్పుడు సొంత పార్టీ టీడీపీ కూటమి అధికారంలో ఉంది. దీంతో మరింతగా రెచ్చిపోవాలని భావించిన వర్మ అనుచరులకు పోలీసుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. రెండు రోజులుగా ఇక్కడ వర్మ అనుచరులను పోలీసులు ఫోన్లు చేసి మరీ హెచ్చరిస్తున్నట్టు నియోజకవర్గంలో చర్చ సాగుతోంది. బరులు వేయడానికి వీల్లేదని.. ఇది డిప్యూటీ సీఎం నియోజకవర్గమని.. ఇక్కడ పందేలు వేయొద్దని పై నుంచి ఆదేశాలు వచ్చాయని వారు తేల్చి చెబుతున్నారు.
అంతేకాదు.. ఎవరైనా సాహసించి బరులు గీస్తే.. అరెస్టులు తప్పవని కూడా పోలీసులు హెచ్చరించారు. దీంతో అనుచరులు ఇప్పుడు వర్మ ఇంటికి క్యూ కడుతున్నారు. కానీ, ఆయన మాత్రం మౌనంగా ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న వర్మ.. తాను త్వరలోనే వస్తానని.. మీరు అధైర్య పడవద్దని చెప్పినట్టు తెలిసింది. మరోవైపు.. జనసేన నాయకులు కూడా.. బరులు గీస్తే.. చర్యలు తీసుకోవాలని కోరుతూ.. ఎస్పీకి ఫిర్యాదులు చేయడం గమనార్హం.
ఈ పరిణామాలతో వర్మ వర్గం డోలాయమానంలో పడింది. ఇప్పటి వరకు తమదే పైచేయిగా ఉందని.. ఇప్పుడు అనూహ్యంగా తమకు బ్రేకులు వేయాలని చూస్తున్నారని వారు ఆగ్రహంతో రగిలి పోతున్నారు. అయితే.. ఈ వ్యవహారంలో బహిరంగ వ్యాఖ్యలు చేయలేని పరిస్థితి నెలకొంది. కనీసం ఒకటి రెండు బరులైనా ఏర్పాటుచేసుకునేలా అనుమతులు ఇప్పించాలని వారు కోరుతున్నారు. కానీ, ఈ విషయంలో జోక్యం చేసుకుంటే.. ఇబ్బందులు తప్పవన్న సంకేతాలు బలంగా ఉండడంతో వర్మ కూడా మౌనంగా ఉన్నారని సమాచారం. మరి సంక్రాంతి నాటికి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on December 15, 2024 3:12 pm
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకాకపోవడంపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీకి హాజరుకాకుండా…
వన్ నేషన్, వన్ ఎలక్షన్ విషయంలో చాలా రోజులుగా అనేక రకాల అభిప్రాయాలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. జమిలి…
మంచు వారి కుటుంబ గొడవ కాస్త సద్దుమణిగినట్లే కనిపిస్తుండగా.. మళ్లీ ఓ వివాదంతో ఆ ఫ్యామిలీ వార్తల్లోకి వచ్చింది. తన…
ఇప్పటి వరకు పార్టీ నుంచి వెళ్లిపోతున్నవారిని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అడ్డుకోలేదు. వారికి ఎక్కడా.. బ్రేకులు వేయలేదు.…
వైసీపీ ఫైర్బ్రాండ్ నాయకుడు.. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తన మకాం మార్చేశారు. ప్రస్తుతం ఆయన రాజకీయం.. ఒంగోలు…