అల్లు అర్జున్‌పై మాకు క‌క్ష లేదు:సీత‌క్క‌

ఐకాన్ అల్లు అర్జున్ అరెస్టు వ్య‌వ‌హారం.. రాజ‌కీయంగా యూట‌ర్న్ తీసుకుంటోంది. ఈ విష‌యంలో తెలంగాణ స‌ర్కారుపై సోష‌ల్ మీడియాపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ కేసులో అర్జున్‌ను అరెస్టు చేయ‌డం.. ఆ వెంట‌నే జైలుకు పంపించ‌డం తెలిసిందే. అయితే.. హైకోర్టు ఆయ‌న‌కు ముంద‌స్తు బెయిల్‌ను మంజూరు చేసింది. 4 వారాల పాటు ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. ఈలోగా ఆయ‌న త‌న‌పై న‌మోదైన కేసుల నుంచి బ‌య‌ట ప‌డే మార్గాల‌ను వెతుక్కోవాల‌ని హైకోర్టు సూచించింది.

అయితే.. సోష‌ల్ మీడియాలో మాత్రం అల్లు అర్జున్‌కు అనుకూలంగా తెలంగాణ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా కొంద‌రు కామెంట్లు చేస్తున్నారు. ఉద్దేశ పూర్వ‌కంగా ప్ర‌భుత్వం అల్లు కుటుంబంపై ఇలా చేస్తోంద‌ని విమ‌ర్శ లు వ‌స్తున్నాయి. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు కూడా.. ప్ర‌భుత్వం అల‌స‌త్వం కార‌ణంగానే ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని.. రాష్ట్రంలో పోలీసు వ్య‌వ‌స్థ‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్వీర్యం చేసింద‌ని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌.. సుదీర్ఘ ట్వీట్ చేశారు. ఇక‌, రాష్ట్ర బీజేపీ నాయ‌కులు కూడా అదే త‌ర‌హాలో వ్యాఖ్య‌లు చేశారు.

ఈ క్ర‌మంలో తాజాగా స్పందించిన మంత్రి సీత‌క్క‌.. అల్లు అర్జున్‌పై త‌మ‌కు ఎలాంటి క‌క్ష లేద‌ని స్ప‌ష్టం చేశారు. మ‌హిళ తొక్కిస‌లాట‌లో మృతి చెందార‌ని.. ఈ విష‌యంలో చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుని పోతుంద‌ని చెప్పారు. చ‌ట్టం ఎవ‌రికీ చుట్టం కాద‌న్నారు. ఎవ‌రైనా చ‌ట్టం ముందు స‌మాన‌మేన‌ని చెప్పారు. ఈ విష‌యంలో ప్ర‌బుత్వం కానీ, మంత్రులుగా తాము కానీ.. జోక్యం చేసుకున్న‌ది లేద‌ని తెలిపారు. ఈ విష‌యాన్ని ఇంత‌టితో వ‌దిలేయాల‌ని.. రాజ‌కీయంగా చూడాల్సిన అవ‌స‌రం లేద‌ని సీతక్క చెప్పుకొచ్చారు.

కాగా, శుక్ర‌వారం.. రెండు సార్లు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి కూడా.. ఇదే విష‌యాన్ని చెప్పుకొచ్చారు. తాను కానీ, త‌న మంత్రులు కానీ.. ఈ కేసులో జోక్యం చేసుకోలేద‌ని.. చ‌ట్ట ప్ర‌కార‌మే న‌డుచుకుంటున్నార‌ని వ్యాఖ్యానించారు. చ‌ట్టం ఎవ‌రికీ అనుకూలం కాద‌న్న ఆయ‌న‌.. చ‌ట్టం ప్ర‌కారమే పోలీసులు వ్య‌వ‌హ‌రించా ర‌ని చెప్పారు. అయిన‌ప్ప‌టికీ.. సోష‌ల్ మీడియాలో పోలీసుల‌పైనా.. ప్ర‌భుత్వంపైనా విమ‌ర్శ‌లు అయితే.. ఆగ‌క పోవ‌డం గ‌మ‌నార్హం.