ఒక దేశం.. ఒక ఎన్నిక పేరుతో జమిలి ఎన్నికల అంశంపై చర్చకు తెర తీసిన మోడీ సర్కారు.. ఇప్పుడా అంశాన్ని వాస్తవరూపంలోకి తీసుకొచ్చే ప్రయత్నాల్ని వేగవంతం చేసింది. దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికతో పాటు.. రాష్ట్రాలకు నిర్వహించే అసెంబ్లీ ఎన్నికల్ని దేశ వ్యాప్తంగా ఒకేసారి జరిపేందుకు వీలుగా సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన చట్టపరమైన చర్యలకు వీలుగా కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపటంతో.. అతి త్వరలో పార్లమెంటులో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశ పెట్టే వీలుంది.
జమిలి ఎన్నికలకు అవసరమైన రెండు బిల్లులను పార్లమెంట్ ఆమోదిస్తే జమిలి ఎన్నికల వ్యవహారం చట్టబద్ధమవుతుంది. అయితే.. రెండు బిల్లుల్లో మొదటి బిల్లుకు లోక్ సభ.. రాజ్యసభల్లో మూడింతల్లో రెండింతల మెజార్టీ అవసరమవుతుంది. ప్రస్తుతానికి లోక్ సభ..అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల్ని ఒకేసారి నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహించే అంశాన్ని పక్కన పెడుతున్నారు. దీనికి కారణం దేశంలోని సగం రాష్ట్రాలు ఆమోదం పలకాల్సి ఉంది. అందుకే.. ఆ విషయంలో దూకుడు ప్రదర్శించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇక.. జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ స్పందించింది. బిల్లులను చూసిన తర్వాత స్పందిస్తామని స్పష్టం చేసింది. అదే సమయంలో దేశంలో జమిలి ఎన్నికలకు మించిన పెద్ద సమస్యలు ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. జమిలి ఎన్నికలకు మద్దతు ఇచ్చే రాజకీయ పార్టీలు ఎన్ని? వ్యతిరేకించే పార్టీలు ఏంటి? స్పందించని పార్టీలేవి? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.
ఎందుకుంటే.. పలు రాష్ట్రాల్లో బీజేపీకి మిత్రపక్షాలుగా వ్యవహరిస్తూ అధికారాన్ని షేర్ చేసుకుంటున్న పలు రాజకీయ పార్టీలు సైతం జమిలిపై ఇప్పటివరకు స్పందించలేదు. పార్టీల వారీగా చూస్తే..
మద్దతు ఇచ్చిన పార్టీలు ఏవంటే..
This post was last modified on December 13, 2024 9:39 am
‘ఆర్ఎక్స్ 100’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ దర్శకుడు అజయ్ భూపతి, మళ్లీ తన పవర్ చూపించిన సినిమా..…
విశాఖ రైల్వే జోన్..ఉమ్మడి ఏపీ విడిపోయిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన కీలక హామీలలో ఒకటి. జగన్ హయాంలో అదిగో…
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఇప్పటికే వలసదారులపై కఠిన…
అగ్రరాజ్యం అమెరికాలో నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టినప్పుడు.. భారత ప్రధాని నరేంద్ర మోడీ మురిసిపోయారు. "నా ప్రియ…
ఇవాళ సీనియర్ నిర్మాత, ఫైనాన్షియర్ శింగనమల రమేష్ బాబు ప్రెస్ మీట్ నిర్వహించడం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి రేపింది. పధ్నాలుగు…
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల నుంచి తెలుగుదేశం, జనసేన కార్యకర్తల నుంచి ఒక రకమైన అసంతృప్త…